అరవై ఏళ్ల నుండీ తెలంగాణా ప్రాంత మెజారిటీ ప్రజల్లో ప్రత్యేక
రాష్ట్ర కాంక్ష వాస్తవం.. సీమాంధ్ర ప్రజానీకంలో కలిసుందాం అని నిశ్కల్మశంగా
ఆలోచించే వాళ్లున్నారు వాస్తవం.. కానీ కేవలం రాజకీయ, వ్యాపార ప్రయోజనాల
గురించే ఆలోచించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న గుంటనక్కలు నేడు
క్షేత్రస్థాయిలో చక్రం తిప్పుతున్న మాట కాదనలేని సత్యం.
కేంద్రం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. అది తెలంగాణా సెంటిమెంటును గౌరవించి ప్రకటించిందో, రాబోయే ఎన్నికల ప్రయోజనాలకై ప్రకటించిందో, తమ పార్టీ ప్రాభల్యాన్ని పెంచుకోవడానికి ప్రకటించిందో మొత్తానికి ఇన్నాళ్లుగా నానుతున్న ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇది హర్షించదగ్గ విషయం.
నేడు సీమాంధ్రలో రాజకీయ నాయకులు పాత నాటకాన్నేమళ్ళీ కొత్తగా ఆడుతున్నారు. కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ప్రకటించింది అని తెలుసు.. ఫైనల్ అయిందనీ తెలుసూ.. దాన్ని మార్చలేమనీ తెలుసు.... అయినా ఎందుకోసం...? ఎవరి మెప్పుకోసం..? సీమాంధ్ర నాయకులు రాజీనా(డ్రా)మాలు ఆడుతున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నారు..??
ఎలాగూ తెలంగాణా ప్రకటించారు. కనుక సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయంగా చక్రం తిప్పాలన్నా, తమ పార్టీల పట్టు పెంచుకోవాలన్నా, క్యాడర్‌ను కాపాడు కోవాలన్నా, ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలి అన్న కుటిల రాజకీయాలు భాగా వంటబట్టించుకున్నారు. నేటి రాజకీయ కౌటిల్యులు. కాబట్టి సమర్థవంతంగా వాటిని అమలు పరుస్తున్నారు.
ముఖ్యంగా 'భాగ్య'నగరం, హైదరాబాద్ సీమాంధ్ర బడా నాయకుల ఆస్తిపాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్న స్వర్గసీమ. వాటిని కాపాడుకోవాలీ.. వారి బడా వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే..! తప్పకుండా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమైనా అయ్యి ఉండాలి. లేదా ఉమ్మడి రాజధాని అయినా అయ్యి ఉండాలి. కాబట్టి తెలంగాణాను ఎలాగూ ఆపలేం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేసుకుని ఆస్తిపాస్తులకు, వ్యాపారాలకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుందామనే దు(దూ)రాలోచనలో ఉన్నారు.
ఇక్కడో చిత్ర విచిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. భిన్న రాజకీయ నాయకులే కాదు, శాశ్వత శత్రుత్వం ఉన్న పత్రికలూ నేడు జతకట్టాయి. ముఖ్యంగా రెండు బద్ధ శత్రువులైన ఈనాడు, సాక్షి పత్రికలు ఛానెళ్లు ఏ ఒక్క సమస్యను ఒకే కోణంలో చూపి ఎరుగనివి. నేడు ఈ సమస్యపై కాపీ పేస్టు చేస్తున్నారా అన్నంత సారుప్యంగా వార్తా ప్రసారాలు చేస్తున్నాయి. గోరంతను కొండంతలు చేసి చూపిస్తున్నది.. దేనికోసం..? హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీ అక్రమాజర్జన గురించి తెలియనిది కాదు. సాక్షి అంటేనే అక్రమ సంపదతో జన్మించిన మానస ప(పు)త్రిక ఇదీ తెలియంది కాదు. ఇక అమాయక ప్రజానీకానికి తెలియంది ఏమంటే..? వాటి మనుగడ సాగాలంటే..? హైదరాబాద్ లో కేంద్రీకృతమైన వాటి అక్రమాస్తులు కాపాడుకోవాలి. వాటిని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీల డప్పు వాయించాలి. కాబట్టి పోటాపోటీగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను పనిగట్టుకుని మరీ చూపిస్తున్నాయి.
ఇక చివరగా దీని వల్ల నష్టపోతున్నదీ, బాధపడుతున్నది సాధారణ ప్రజలు మాత్రమే. ఇటు తెలంగాణాకు ఏకైక ప్రతినిధిగా తనకు తాను చెప్పుకునే కేసిఆర్ గారు హైదరాబాద్ తన అబ్బసొమ్ము అన్నట్లు సాధారణ ఉద్యోగలను వెళ్లగొడతామనడం.. ఈ వాగుడును వాడుకుని సీమాంధ్రలో తలలు పండిన నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టడం, తయారు చేసిన స్క్రిప్టులా చకచకా జరిగిపోతున్నాయి. ఇదంతా రాజకీయ క్రీడ. ఒక మాట తూటాను విసిరి మనసుల మధ్య మనుషుల మధ్య విద్వేషాలు సృష్టిస్తే నష్టం ఎవరికి? దేశానికి కాదా.!! భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన దేశంలో ఏకత్వంలో భిన్నత్వాన్ని రెచ్చగొట్టడం అంటే దేశ రాజ్యాంగానికే మచ్చ. భారత పౌరుడు 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రజలను పీల్చి పిప్పిచేసి ప్రజా సంపదను దోచుకున్న బడా నాయకులనునేడు హైదరాబాద్ నుండి తరిమి కొట్టాలి. ఇరు ప్రాంతాల సాధారణ ప్రజానీకంలో సోదర బావం చాటాలి. ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా కలిసిసుందాం అని ఐక్యతను పెంపొందించాలి. అది ఒక బాధ్యతాయుత భారతీయుడిగా మన ముందున్న తక్షణ కర్తవ్యం.
- సుందర్

One thing is sure. The Congress leaders of Seema Andhra know well in advance that the state is going to be divided. The resignations are nothing but drama. As you rightly said, they want to keep Hyderabad as U.T or 2nd Capital just to preserve their interests and assets. My feeling is people from Seema Andhra should develop their region by bringing a new political force.They should kick out Congress & TDP.
ReplyDelete