'మానసిక సౌందర్యమే గొప్పది' అని చాటి చెప్పిన తెలుగు అందం 'మిస్ అమెరికా కిరీటాన్ని ఎగరేసుకుపోవడం' చూసి అమెరికా జాత్యాంహాకారుకులకు మింగుడు పడటం లేదు. తెల్లతోలు పొగరు నెత్తికొట్టుకుంటోంది. అమెరికా మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది...
అమెరికన్లకు జాత్యహంకార కొవ్వు ఇంకా తగ్గలేదు.. అది అమెరికన్ల రక్తంలో ఏ స్థాయిలో కలిసిపోయిందో మరోసారి నిరూపితమైంది.. ఒక వైపు అసమానతలు వద్దంటూ ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు చైతన్యం తెచ్చే ప్రయత్నాల్లో ఉంటే.., అమెరికన్లు మాత్రం మా తెల్ల తోలే గొప్పదంటూ తమ బలుపును ప్రదర్శిస్తున్నారు.. దీనికి తాజా ఉదాహరణే... మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న మన తెలుగుతేజంపై అమెరికన్లు చేస్తున్న ట్వీట్లు.. ఎన్ఆర్ఐ నీనా దావులూరి మిస్ అమెరికాగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె కిరీటం గెలుచుకున్న కొద్ది గంటల్లోపే కొందరు అమెరికన్ పౌరులు జాత్యహంకార జాఢ్యాన్ని చూపారు. తమ జాతి వివక్ష పైత్యాన్ని ట్విట్టర్లో వెళ్లగక్కారు. ''నీవు ఉగ్రవాదిలా ఉన్నావు...అమెరికా నుండి వెళ్లిపో'' అని ''handle @emi_adkins'' ఈ యూజర్ నుండి మొదటి ట్వీట్ వెలువడింది. ఇక ల్యూక్ బాసిలి అనే పెద్ద మనిషి ఏకంగా 9/11 దాడులను లింక్ చేస్తూ ట్వీటాడు. ''నాలుగు రోజుల కిందట 9 /11 సంఘటన జరిగింది. ఇప్పుడు ఈమె మిస్ అమెరికాగా ఎంపికయింది'' అని పేర్కొన్నాడు. పోకీ అనే వ్యక్తి పోకిరి మాటలు వదిలాడు. ఏకంగా ''మిస్ అమెరికాగా ఎంపికైంది ఒక అరబ్బు క్లాసికల్ డాన్సర్ ''అని తన పైత్యాన్ని వెళ్లగక్కాడు. నాటే అనే మహానుభావుడు ఆసియా ఖండాన్నీ వదల్లేదు. ''మీరు ఇండియన్లయినా...ఆసియన్లయినా..అమెరికాలో కిడ్ లే'' అంటూ అవమానించే ప్రయత్నం చేశాడు. తెల్ల తోలు మగరాయుళ్ల వ్యాఖ్యలు ఇలా ఉంటే..అమెరికన్ ఆడవారు తమ జలసీని వెళ్లగక్కారు. ''ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను రేసిస్ట్ ను కాదు.. అంటూనే,ఇది అమెరికా...మిస్ అమెరికా గా ఎంపికైంది ఒక టెర్రటిస్ట్'' అని జెస్సికా అనే యువతి పేర్కొంది. అయితే ఇంత జాత్యహంకార నీడలు వెంటాడుతున్నప్పటికీ స్త్రీవాద బ్లాగు జీజెబెల్ మాత్రం మన తెలుగు తేజానికి అండగా ట్వీటింది. '' రేసిస్ట్ లు రేసిస్ట్ వాఖ్యలే చేస్తారు...ఎందుకంటే మిస్ అమెరికాగా ఎన్నికైంది ఒక అమెరికన్ కాదు గనుక.'' అని పేర్కొంది. ఇదిలా ఉంటే '' ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందంతోపాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక సౌందర్యమే గొప్పది'' అని జడ్జి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అందరి మనసులను, మిస్ అమెరికా కిరీటాన్ని గెలుచుకున్న మన తెలుగు తేజం నీనా దావులూరి హుందాగా ప్రవర్తించింది.'' వాటికి నేను అతీతం..వాటిని పట్టించుకోబోను'' అని వ్యాఖ్యానించింది.
సుందర్

No comments:
Post a Comment