అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, February 6, 2011

వారికి ఆ పిచ్చి ఎందుకు?

మనిషికి నానాటికి ఒక పిచ్చి పెరిగిపోతోంది. 'మని'షి అంటే అర్థం మారిపోతోంది. ప్రేమానురాగాలు మంట గలిసిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఒక్కటే అదే 'డబ్బు'. ఒకప్పుడు కరెన్సీ అనేది వస్తు మారక పద్దతినుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు ఉపయుక్తంగా ఉండేది. కానీ రానురాను డబ్బు అనేది వ్యసనంగా తయారైంది. కనీసం గుక్కెడు గంజినీళ్లు కూడా దొరకని అభాగ్యజీవులున్న ఈ సమాజంలో టాటా, అంబానీలు, వారి విలాసాలకోసం లక్ష్యల కోట్లను వృధాగా ఖర్చు చేస్తున్నారు. లక్షాధికారి కోటీశ్వరుడవుతున్నాడు. కోటీశ్వరు ఇంకా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ పేద వాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు. అంటే కేవలం డబ్బు అనేది పిచ్చిగా మారడమే తరాలు తరాలు కూర్చొని తిన్నా తరిగిపోని ఆస్తి ఉన్నా ఇంకా ఇల్లీగల్‌ వ్యాపారాలు చేయడం. ప్రభుత్వాలను, ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూడడం ఇదంతా చూస్తుంటే డబ్బు అనేది సమాజంలో కొంతమంది చేతుల్లోకి వెళ్తుంది. దీని వళ్ల దేశానికి ప్రపంచానికి చాలా ప్రమాదం అని చెప్పవచ్చు. అందుకే డబ్బు అనేది ప్రభుత్వం ఆధినంలో ఉండే విదంగా ప్రజలందరూ బిలియనీర్లు కాకున్నా కనీసం మూడు పూటలు కడుపు నిండా తినేట్లు ఉండాలి. ఇదే నా ఆశ ఇదే నా ఆశయం........
సుందర్

1 comment:

  1. ప్రపంచం లో అందరి ఆశ అదే. కానీ ఏవిధంగా సాధించ గలుగు తాము అనేదే తెలియటల్లేదు. డబ్బులున్న వాళ్ళ దగ్గరనుండి డబ్బులు తీసుకుని అందరికీ పంచా మానుకోండి, అది పనిచెయ్యదు. దాన్ని ఒకసారి మాత్రమే చెయ్యగలం. కొత్త పరిశ్రమలు మొదలుపెట్టేవాళ్ళు, వాటిని నడిపించే వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే డబ్బుకోసం. ఆ కోరిక లేకపోతే ఆ పరిశ్రమలూ ఉండవు.

    ప్రతీ వాళ్ళు స్వయంశక్తి తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తీ వచ్చినప్పుడు ఇది సాధ్య పడుతుంది. దీనికి మనం చెయ్యగలిగింది: పనికి వచ్చేవిద్యని అందరికీ అందేటట్లు చెయ్యటం. చిన్న చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించటం. ఇంతకన్న వేరే మార్గం లేదు.

    ReplyDelete