అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, April 10, 2011

ఇలాంటికేసులతో యమ డేంజర్‌ జర జాగ్రత్త సుమీ.....

మొన్న ఈ మధ్యన ఒకరోజు మా ఫ్రెండ్‌ నేనూ.. మిదాని బస్టాండు వద్ద నిల్చున్నాము.. అప్పుడే ఒక వ్యక్తి సుమారు 25 సంవత్సరాలుంటాయి.  ఏదో అడుగుతున్నాడు. మేము మాత్రం మా మటల్లో పడి అతన్ని పట్టించుకోవడం లేదు. కొద్ది సేపటికి అతన్ని గమనించి ఏం కావాలి అన్నాన్నేను.. అతడు అన్నాడు.. ''అన్నా నేను శంషాబాద్‌ వెళ్లాలి  ఛార్జీకి ఐదు రూపాయలు తక్కువగా ఉన్నాయి అన్నాడు మొహం దీనంగా పెట్టి''... ఏముంది ఐదురూపాయలే కదా పాపం ఇక్కడ మాత్రం ఎవరినడుగుతాడు అని తీసి ఇచ్చాను.. అతడు థ్యాంక్స్‌ చెప్పి వెళ్లిపోయాడు..  మా ఫ్రెండ్‌తో చెప్పాను ఈ మధ్యన ఉమెన్స్‌ కాలేజీ దగ్గర కూడా ఒక వ్యక్తి ఇలాగే అడిగాడు... అయినా వీళ్లు డబ్బులు పెట్టుకోకుండా సిటీకి ఎందుకు వస్తారు.. అనగానే మా ఫ్రెండ్‌ అటు చూడు అంటూ పక్కకు చూపించాడు. ఇంతకుముందు నా దగ్గర డబ్బులు అడిగిన వ్యక్తే సేం... ఖహాని .... చెప్పి మరో ఇద్దరుముగ్గిరి దగ్గర డబ్బులు అడుగుతున్నాడు..... వాళ్లూ ఇస్తున్నారు. కొద్ది సేపు వాణ్ణే గమనిస్తే వాడు కనిపించిన ప్రతీవాళ్లని అడుగుతున్నాడు.  అప్పుడు అర్థమైంది వీడి పనే ఇదని... లోకంలో ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారా అనిపించింది..... కానీ ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా డబ్బులు లేక అడిగే వాళ్లెవరో.. ఇలాంటి ఉద్ధండులెవరో తెలుసుకోవడం కష్టం సుమీ.....
సుందర్

No comments:

Post a Comment