అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, September 7, 2011

తమ ఇళ్లకు పటిష్ట భద్రత, తమకు జడ్‌ కేటగిరీ భద్రత, మరి సామాన్య ప్రజానీకానికీ...?

తమ ఇళ్లకు పటిష్ట భద్రత, తమకు జడ్‌ కేటగిరీ భద్రత, కానీ సామాన్య ప్రజానీకానికి. ఏ భద్రత లేదు. దేశ రాజదాని ఢిల్లీలో అదీ హైకోర్టు ముందు బాంబు పేలుళ్లు హవ్వ దేశ రక్షణ వ్యవస్థకే సిగ్గు చేటు. మే నెలలోనే ఢిల్లీ హైకోర్టు పార్కింగ్‌ ప్రాంతంలో పేళ్లుళ్లు సంభవించాయి. అయినా ఎలాంటి భద్రత పెంచకపోవడం,  ఇంటలిజెన్స్‌ వ్యవస్థను ముమ్మరం చేయకపోవడం మళ్లీ పేలుళ్లు జరగడం చూస్తే... ఈ దేశ రక్షణ వ్యవస్థ ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాదార ప్రజానీకం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా... సంఘటన జరగగానే ఒక ఖండన మీడియా ముఖాన కొట్టి అప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయే ఇలాంటి పాలకులున్నంత కాలం దేశంలో ఇలాంటి మారణకాండలు జరుగుతూనే ఉంటాయి. 
సుందర్

No comments:

Post a Comment