అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, August 16, 2011

పవిత్రమైన గుడిలోకూడా ఇలాంటివి ఎందుకు చేస్తారో....!

 ఈ రోజు మా బద్రుక కాలేజ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లాను. రెండు గంటలు జర్నీ చేసి బస్సు దిగగానే... గుడి ద్వారం కనిపించింది చాలా బాగుంది.  గుట్టపైకి ఎక్కేసి కాళ్లు కడుక్కుని దర్శనానికి వెళ్లేదారిలో కొబ్బరికాయలు తీసుకున్నాము. లోనికి వెళ్లగానే అక్కడ ఉన్న దైవ విగ్రహాలు (శిల్పాలు) చాలా చక్కగా ఉన్నాయి. అక్కడ గుడి ఆ వాతా వరణం అబ్బో చాలా ప్రశాంతంగా మరియు పవిత్రంగా అనిపించింది. అప్పుడే గోడవైపు చూసాను.. అక్కడ స్పెషల్‌ దర్శనం 25/రూ.. అని ఉంది. ఆ దారి నుండి వెళ్తే దైవ దర్శనం తొందరగా చేసుకోవచ్చు... కొంచెం ముందుకు వెళ్లగానే దైవదర్శనం 101/రూ.. అని ఉంది. ఆ దారి నుంచి వచ్చే వాళ్లు చాలా తొందరగా దర్శనం చేసుకుని వెళ్లొచ్చన్నమాట.. ఈ దేవుడి దగ్గరకూడా డబ్బున్నోడిదే కదా రాజ్యం అనిపించింది. ఇక లోనికి నరసింహ స్వామి మెయిన్‌ గుడిలోకి వెళ్లాము భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది, ఇరకాటంగా కూడా ఉంది. అక్కడ దర్శనం చేసుకుంటుంటే ఒక అర్చకుడు ఒక చిన్న దండకం (కర్ర్ర)తో భక్తులను తడుతున్నాడు (దీవిస్తున్నాడు) అయితే మేము అక్కడికి వెళ్లగానే ఆ కర్రతో మమ్మళ్ని తట్టిన ఆ గుడి అర్చకుడు పక్కన ఉన్న మరో వ్యక్తిని (అక్కడే పనిచేసే వ్యక్తిని) నీకు బాగా బలిసిందిరో అంటూ భూతులు తిడుతున్నాడు... వీడబ్బ.. దేవుడి గుడిలో అర్చకుడిగా ఉంటూ బూతులు మాట్లాడుతున్నాడు.. నాయాలా.. అన్నాడు మాఫ్రెండ్‌ నరేష్‌. కొద్దిగా ముందుకు వెళ్లగా కొబ్బరికాయ కొట్టు స్థలం ఉంది. అక్కడా ఇద్దరు అర్చకులు ఉన్నారు. వాళ్లు కొబ్బరికాయ కొట్టి డబ్బులు తీసుకుంటున్నారు.. కొబ్బరికాయ కొట్టేందుకు కూడా డబ్బులా.. అనుకున్నా... అందరూ 10/రూ... ఇస్తున్నారు కదా నేను ఇద్దామని ఎంత అన్నాను మీ ఇష్టం అన్నాడు అతను.. 10/రూ.లు ఇచ్చాను కొద్దిగా అక్కడనుండి పక్కకు జరిగి చూస్తే 'కొబ్బరికాయ కొట్టినందుకు ఎలాంటి డబ్బులు ఇవ్వొదు' అని బోర్డు అక్కడే రాసిఉంది. దేవుడి గుడిలో ఉంటూ.. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు...
ఈ రోజు అక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్ చేసాము బట్‌ ఈ  మూడు విషయాలు మాత్రం నా మదినుండి ఇంకా తొలగట్లేదు.. పవిత్రమైన గుడిలోకూడా ఇలాంటివి ఎందుకు చేస్తారో.... అని......!
సుందర్

3 comments:

  1. మీకు భగవంతుని పట్ల భక్తిలేకపోవటం వలన.

    అర్ధంకాలేదా . ఉదాహరణకు మీ నన్నగారి దో తాతగారిదో భవంతిలో పనివాల్లు వాళ్లిష్తమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఏంచేస్తారు ?తప్పనిసరిగా ఆవేశంతెచ్చుకుని మరీ ఎదిరిస్తారు. మరిక్కడెందుకు మిన్నకున్నారు ? ఇది నాస్వంతం అనిభావించకపోవటం వలన . మీకు అక్కడికెళ్ళిరావటం పిక్నిక్ కు వెల్లి ఎంజాయ్ చేసినట్లుందిగాని ,నీతండ్రిని కలుసుకోవటానికి ఆర్తిగాఎదురుచూసి దర్శనం తరువాత పొందే తన్మయత్వం రాలేదు. ఇలారానప్పుడు ఎవడో ఏదో చేయకపోతాడా నే నిర్లక్ష్యం ఉన్నప్పుడు మన ధార్మికశ్రద్దాకేంద్రాలు ఇలానే ఉంటాయి. ఇది మీరొక్కరిని ఉద్దేశించికాదు. సామాన్యంగా హిందువులంతా ధర్మాచరణకలిగివున్నా ధర్మనిష్ఠ లేకపోవడం వలన ఈ దుస్థితి దాపురించింది . ఆలోచించండి ఇక్కడ ఏ అనాచారం జరిగినా అది మన నిర్లిప్తత వలనే అని మీకర్ధమవుతుంది. కనీసం అక్కడ ఫిర్యాదుల పుస్తకం ఉంటుంది దానిలో ఒక్కముక్కవ్రాయవచ్చునే? > భగవంతుడిచ్చిన నోటితో అనేక పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటాం ఇలాంటప్పుడు దానినుపయోగించి మీనిరశన తెలియజేయవచ్చునే ? చేయరు...ఎందుకంటే మనకు ప్రశాంతతకావాలి,కానీ ఆప్రశాంతతని భంగపరిచే విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తరు ....మనకెందుకులే అని తప్పుకుపోతారు .

    ReplyDelete
  2. పవిత్రమనేది మనస్సులో వుంటుంది గాని స్థలాల బట్టి కాదు

    ReplyDelete
  3. chanakya gaaru u mean devaalayaallo ledantaaraaa?

    ReplyDelete