అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, May 24, 2011

ఘోరి మహ్మద్‌ దండయాత్ర గురించి విన్నాం, గజినీ మహ్మద్‌ దండయాత్ర గురించి విన్నాం ఈ ఒక్క రాత్రి దండయాత్ర ఏంటని అనుకుంటున్నారా...

 ఘోరి మహ్మద్‌ దండయాత్ర గురించి విన్నాం, గజినీ మహ్మద్‌ దండయాత్ర గురించి విన్నాం ఈ ఒక్క రాత్రి దండయాత్ర ఏంటని అనుకుంటున్నారా... అదే నండీ ప్రతీ స్టూడెంటూ.. (ఐ మీన్‌ చాలామంది) చేసే దండయాత్ర ముఖ్యంగా డిగ్రీ, పిజీల్లో అయితే ఇదే జరుగుతుంది. ఎలాగూ సెమిస్టరు సిస్టమ్‌ తిప్పికొడితే ఐదు యూనిట్లు... ఏముంది ఒక్క రోజు కరెక్టు గా కూర్చుంటే చాలు అనే ధీమా కానీ ఏం చేస్తాం... ఆ ఒక్క రోజు కూడా కేటాయించడం కష్టమే సుమీ.... ఎలాగూ మధ్యాహ్నం టైం సాధారణ పనులకే సరిపోదు.. ఈవినింగ్‌ దాటి ఏడు ఎనిమిది అయ్యిందంటే... అప్పుడు కొద్దిగా తిని పుస్తకం ముందు పెట్టుకుంటే.. ఇక సిలబస్‌ అయిపోతేగాని లేవం.... ఒక వేళ సిలబస్‌ కొద్దిగా కష్టంగా ఉందటే.... నైట్‌ రెండు మూడు గంటదాకా చదవడం... కొద్ది సేపు పడుకోవడం...  కునుకు పడుతుందో లేదో మళ్లీ లేవడం నాలుగు గంటల నుంచి మళ్లీ కుస్తీ ప్రారంభిస్తే... ఈ కుస్తీ ఎప్పటి వరకు సాగుతుందంటే....పరీక్ష హాలులో అడుగుపెట్టేంత వరకూ.... కమ్మలు (పేజీలు) మల్పుతనే ఉంటం... తీరా ఎక్జాంలోకెళ్లిన తర్వాత పుస్తకంలో ఏముంటుందో ఉండదోగానీ కొత్తకొత్త డెఫినేషన్లు... కొత్తకొత్త అర్థాలు.. ప్రశ్నగురించి అవగాహన కుదిరితే చాలు.... నైటంగా కష్టపడి చదివిన విషయాలు అన్నీ ప్రశ్నకు అనుకూలంగా మాడిఫై చేసి రాయడం అవసరం అయితే కొత్త విషయాలు విషయాలు చొప్పించడం... ఆ జవాబు పత్రాలు చూడాలి ఈజీగా కొత్త సిలబస్‌ తయారు చెయ్యవచ్చు అలాగుంటుంది. స్టూడెంట్సా మజాకా మరి...
సుందర్

No comments:

Post a Comment