అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, January 27, 2011

సినీ పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టించనుందా...?

ఒక ప్రయోగం, అనేక కొత్త మలుపులకు నాంది. ఆ ప్రయోగం విఫలమైనా, సఫలమైనా ప్రయోజనమే చేకూరుతుంది. ఒక వేళ విఫలం అయితే మళ్లీ కొత్త ప్రయోగం ఎలా చేయాలో నేర్పుతుంది. అదే సక్సెస్‌ అయితే ఇక దాన్నుంచి వచ్చే ఫలం ప్రయోగ కర్తకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. 

అందుకే నాకిష్టం ...!

అమ్మను చూపెను కనులే
కమ్మని ప్రేమను చూపును కనులే
గతిని, జతిని, ప్రగతిని
నన్ను నన్నుగా నిన్ను నిన్నుగా
మన్ను మన్నుగా.. 

మిన్ను మిన్నుగా ..

మనసు ముకురాన్ని...
మంచి స్నేహాన్ని,....
మనిషి విలువలను....
చూపిస్తాయని.... నడిపిస్తాయని
ముళ్లదారిలోకెళ్లనీవని
మానవత్వాన్ని.. కురిపిస్తాయని
బాధను నీరుగా కరిగిస్తాయని
అలసి సొలసి సొమ్మసిల్లిన వేళ
కమ్మని నిద్రను అందిస్తాయని
జగతిన బ్రతుకే భారమైనపుడు
శాశ్వత నిద్రకుతో సాగనంపునని..




సుందర్