అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, January 29, 2011

నగుమోము చిన్నది

నగుమోము చిన్నది
బహుసక్కగున్నది
నా కొంటె చేష్టలే చూస్తు కూర్చున్నది
నా చిలిపి మాటలే వింటు ఊకొడుతోంది.
అబ్బబ్బ ఏమందమెంతటీ సౌందర్యం
ఎన్నెన్ని జన్మాల అదృష్టమోనాది
కొనగోటితో నన్ను గిల్లి నవ్వింది
మునిపంటిగాటుకై ముందుకే రాంగా..
ఉలిక్కిపడిన నాకు మెలుకువయ్యింది
కలచెదిరిపోయింది
కన్నెల్లిపోయింది.....
ఆ సిన్నదిలలోన ఏమూలనున్నదో
తన దరికి చేరంగ దారెటుల దొరుకునో
అయ్యయ్యో బ్రహ్మయ్య ఏమి నీమాయ
ఒక సారి చూపించు ఎత్తుకెళ్లిపోతా

సుందర్

ఎవరితో పంచుకోను ఊసులు

తడి ఆరని కన్నీటి మరకలు
తుడుచుకుంటూనే జారుతున్న కన్నీళ్ళు
ఎవరితో పంచుకోను ఊసులు
ఎవరూ కనలేరు మన బాసలు
గెలిచినా ఓడినా గేలిచేసేవే
నను గెలిచి గేలిచేసెల్లిపోయవే
ఎందుకు ఇంకెందుకేడిపిస్తున్నావు  
ఎద్చేడ్చి ఎకిల్లు గుక్క పట్టాయే
ఇలలోన వదిలేసి వెళ్లి పోయావే
ఒకసారి కలలోన కలిసిపోరాదా
మనలేను నువులేని ఈ జగతిలోన
నీ జతకు వస్తాను నీ పక్క సీటుంచు.
(నిన్నటి వరకు మా మద్యనే ఉంటూ.. తిరిగి రాణి తీరాలకు వెళ్ళిన మా అన్న నరసింహ కోసం...)

సుందర్