ఈరోజు హనుమజయంతీ ఉత్సవాలలో ఒక సంఘటన జరిగింది. చాలా మంది హనుమాన్ రథాన్ని లాగుతున్నారు.. అక్కడికి వెళ్లి కొద్దిసేపు వీడియో తీసుకుని రథం తాడు నేను కూడా పట్టుకున్నా... ఒక వ్యక్తి వచ్చి నాపక్కన నిల్చున్నాడు.. ఎవరబ్బా ఎక్కడో చూసినట్టుందే.. అనుకున్నా... కానీ గుర్తుకు రావడం లేదు.... కొద్ది సేపటికి గుర్తొచ్చింది. సినిమాల్లో ఆక్ట్ చేస్తాడు కదా.. అనుకున్నా... అతడే నర్సింగ్ యాదవ్ కొద్దిసేపు కాగానే అన్నా... నమస్తే రావే అంటూ... అతనిచేత ప్రత్యేక పూజలు చేయించారు.. అతను మళ్లీ వచ్చి నేను పట్టుకున్న దగ్గరే తాడు పట్టుకుని రథాన్ని లాగుతున్నాడు. చాలా సార్లు టచ్చయ్యాడు.. స్టార్లు అంటే గింతే కదా... అనుకున్నా కొద్దిసేపటికి ఒక్కొరుగా వచ్చి ఒక్కఫోటో సార్ అని అతనితో ఫోటోలు దిగుతున్నారు.. అందరూ హలో సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.. నేనూ ఇద్దామనుకున్నా... కానీ అతనికి మనమేమన్నా గుర్తుంటామా... గుంపులో గోవిందలాగా ఇతనికి ష్యేక్‌హ్యాండ్ ఇవ్వడం ఎందుకు టైంవేస్టు అనుకుంటూ... ముందుకు వెళ్లిపోయాను...
సుందర్అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Tuesday, April 19, 2011
అబ్బబ్బబ్బబ్బా....... ఇంత వైభవంగా... నా లైఫ్‌లో ఫస్ట్ టైం.....!
ఈరోజు ఈవినింగ్ ఆఫీసుకు బయలుదేరాను కోఠికి రాగానే రాంనగర్ బస్ దొరికింది అమ్మయ్య.. ఆఫీసుకు తొందరగా వెళ్లొచ్చు అని కూర్చున్నా... ఐదు నిమిషాలవుతుంది... పది నిమిషాలవుంది... అర్థగంట అవుతోంది. బస్సు ఎంతకూ కదట్లేదు... ట్రాఫిక్ జాం ఇంతలా ఎందుకుంది అబ్బా అనుకుంటూ... ఆలోచిస్తోన్నా... కొద్దికొద్దిగా కొద్దికొద్దిగా కదులుతూ.. కింగ్‌కోఠి వరకూ.. వచ్చింది బస్సు. అక్కడ కిక్కిరిసిన జనం ఉన్నారు. ఏదో ఊరేగింపు జరుగుతోంది. ఏం ఊరేగింపబ్బా ఇంత ఘనంగా జరుగుతోంది. అని దిగి చూస్తే హనుమజ్జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. హనుమాన్ ను ఊరేగిస్తున్నారు. పెద్దపెద్ద డిజెబాక్సులు... ముందున చిన్నపిల్లలూ.. అమ్మాయిలూ.. పెద్దవారు దాండియా ఆడుతూ.... హనుమాను ఊరేగిస్తున్నారు. నేనూ బస్ పోయేదేకా పాలుపంచుకుందామని దిగి రథాన్ని లాగే తాడును పట్టుకున్నా.... ఎందుకో తెలియదు పట్టలేని సంతోషం.. ఆ దృష్యాలను నా సెల్ ఫోన్‌లో బంధించాను.. కొద్దిగా ముందుకు కాచిగూడవరకూ నడుచుకుంటూ... వెళ్లాను అక్కడ యూత్ ఫుల్ జోష్‌గా బ్యాండ్‌కు అనుగుణంగా కర్ర సాముచేస్తున్నారు. స్టీల్ రాడ్‌కు ఇరువైపులా మంటలూ... అబ్బబ్బా... ఏం తిప్పుతున్నారు.. మినుగురులు ఎగిరి పక్కన వారిమీద పడుతున్నాయి.. తిప్పేవారిమీద పడుతున్నాయి. అయినా... ఆపకుండా... చాలా ... చాలా అద్భుతంగా తిప్పారు. ఇంకా హనుమా.. సీతా రామ లక్ష్మణ వేషాలు వేసారు.. రాథంపై వారుకూర్చన్నారు. మాకు ఇంతకు ముందు హనుమజయంతి అంటే ఒక హాళిడే మాత్రమే... ఉత్సవాల లాంటివి నేనెప్పుడూ చూడలేదు... ఇంత ఘనంగా జరుపుతారా... అనుకున్నా... ఉన్న కొద్దిసేపయినా చాలా ఎంజాయ్ చేసి.. ఆఫీసుకు బయలు దేరాను...
సుందర్
సుందర్
Subscribe to:
Posts (Atom)