అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, September 7, 2011

తమ ఇళ్లకు పటిష్ట భద్రత, తమకు జడ్‌ కేటగిరీ భద్రత, మరి సామాన్య ప్రజానీకానికీ...?

తమ ఇళ్లకు పటిష్ట భద్రత, తమకు జడ్‌ కేటగిరీ భద్రత, కానీ సామాన్య ప్రజానీకానికి. ఏ భద్రత లేదు. దేశ రాజదాని ఢిల్లీలో అదీ హైకోర్టు ముందు బాంబు పేలుళ్లు హవ్వ దేశ రక్షణ వ్యవస్థకే సిగ్గు చేటు. మే నెలలోనే ఢిల్లీ హైకోర్టు పార్కింగ్‌ ప్రాంతంలో పేళ్లుళ్లు సంభవించాయి. అయినా ఎలాంటి భద్రత పెంచకపోవడం,  ఇంటలిజెన్స్‌ వ్యవస్థను ముమ్మరం చేయకపోవడం మళ్లీ పేలుళ్లు జరగడం చూస్తే... ఈ దేశ రక్షణ వ్యవస్థ ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాదార ప్రజానీకం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా... సంఘటన జరగగానే ఒక ఖండన మీడియా ముఖాన కొట్టి అప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయే ఇలాంటి పాలకులున్నంత కాలం దేశంలో ఇలాంటి మారణకాండలు జరుగుతూనే ఉంటాయి. 
సుందర్

నా కొడుకుల్ని కాల్చి చంపేయక వారికి కోట్లు ఖర్చు పెడుతున్నారు...

మొన్న హైదరాబాద్‌, నిన్న ముబై నేడు దేశ రాజధాని డిల్లీ ప్రదేశం ఏదైనా వారి లక్ష్యం ఒకటే విద్వంసం సృష్టించడం. వినాషనానికి పాల్పడటం. ప్రజల్ని చంపి ఆస్తుల్ని ద్వంసం చేయడంలో వారికున్న ఆనందం ఏమిటో నాకర్థం కాదు. మతపిచ్చి నెత్తి కెక్కి మానవత్వం మర్చిపోతున్నారు. అలాంటి వారు పోలీసులకు దొరికితే వారిని శిక్షించకుండా... విలాసవంతమైన జీవితం... నా కొడుకుల్ని కాల్చి చంపేయక వారికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. కసబ్‌... ఆడబ్బ ఎవడైనా కానీ దొరికినవాన్ని దొరికినట్టు కాల్చి చంపేయాలి. అమెరికా వాడు చూడు వాని మీద దాడి చేసిన వాన్ని(బిన్‌లాడెన్‌) వెతికి వెతికి పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లో పట్టుకుని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు. కానీ మన వారు మాత్రం దొరికిన ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఇంకా క్షమా బిక్షలు తొక్క...... ఏంటేంటో అని వాళ్లను వదిలేసున్నారు. దేశ రక్షన వ్యవస్థను పటిష్ట పర్చాలి. ఇంటలిజెంట్‌ వర్గాలను అనువణువునా ఏర్పాటు చేయాలి ఏ చిన్న విద్వంసం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మతమంటే మానవత్వం అనీ...మారణహౌమం కాదని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించాలి..

సుందర్