అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, April 10, 2012

మతం అంటే మమత పంచేది కానీ మంట పెట్టేది కాదని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే దిశగా అడుగులేద్దాం...

హైదరాబాద్‌లో అల్లర్లు.... వారంరోజుల పాటూ కర్ఫ్యూ.... చేలరేగిన అల్లరి మూకలు... ఇళ్లపై దాఢి... ఇళ్లముందు నిలిపి ఉన్న వాహనాలు దగ్ధం... ఈ వార్తలు గత మూడు రోజులగా చదువుతున్నాం.. ఇందులో విచారించదగ్గ విషయం ఏమిటంటే, వారు ఏ కులం ఏ మతం అన్నది పక్కన పెడితే  వీటికి బలౌతున్నది అమాయకులూ.. సాధారణ ప్రజానీకం మాత్రమే..... కులం, మతం, వర్గం, ఇవి చాలా సున్నితమైన అంశాలూ.. ఎంత సున్నితమంటే... తమ ఆచార వ్యవహారాలనూ, .. సాంప్రదాయాలను తమ కన్న తల్లిలా పవిత్రగా భావిస్తున్నాం.. దీన్ని ఆసరా తీసుకుని కొన్ని కల్లోల శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నారు. సాధారణ ప్రజానీకంలో విష ప్రచారం చేస్తూ, మనుషుల మధ్య మనసుల మధ్య తీవ్ర విద్వేషాలు రేకెత్తిస్తున్నారు. ఇక కొన్ని రాజకీయ పక్షాలు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయకపోగా... మరింత రాజుకునేలా... ఉసిగొల్పుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే తంటాలు పడుతోంది తప్ప సమస్య అంతరాల్లోకి వెళ్లి అసలైన దోషుల్ని శిక్షించడంలో పూర్తిగా విఫలమైతోంది.
అరాచక శక్తులు ముఖ్యంగా యువతను పావులుగా వాడుకుంటున్నారు. వారి ఆచార సాంప్రదాయాల పట్ల వారికున్న ప్రేమని బలహీనతగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా పురిగొల్పుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒక చదువుకోని వ్యక్తి ఏదో అవగాహన లోపంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటే అది వేరే విషయం భాగా చదువకుని సమాజంలో మంచి ఉన్నత స్థానాలో ఉన్న యువత కూడా దీనికి ప్రేరేపించ బడుతున్నారంటే బలహీనత ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమవుతోంది. ఏం జరిగినా గుడ్డిగా నమ్మేయడం పక్క మతానికి రుద్దడం... దాడులకు పాల్పడడం.... ఇదీ నేడు దేశంలో జరుగుతున్న నిత్య కృత్యాలు...
సోదరులారా ఇది మన దేశం సర్వ మత సమ్మేళనం... అన్ని రంగులు కలిగిన ఇంద్ర ధనుస్సులాంటి మన దేశాన్ని శాంతి, సౌభాగ్యాలతో కళకలలాడేలా కాపాడుకుందాం... అరాచక శక్తులను తరిమి కొడదాం అన్నదమ్ములలా కలిసిమెలసి ఉందాం... అందుకు మనవంతుగా మతం అంటే మమత పంచేది కానీ మంట పెట్టేది కాదని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే దిశగా అడుగులేద్దాం....
సుందర్

No comments:

Post a Comment