అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, April 5, 2012

బాద్యులు ఎవరు...???



అది రాష్ట్రంలోనే ఒక పేరు మోసిన కళాశాళ, అందులో ఒక చిరు ఉద్యోగి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ కళాశాలలో ఒక చిన్న విభాగంలో పని చేస్తున్నాడు. ఒక రెండు సంవత్సరాల క్రితం జీతం రెండు వేలు పెరిగింది. దీంతో ఎంతో సంబరపడిపోయాడు. సరిగా రెండు సంవత్సరాల తర్వాత ఆ కళాశాల యాజమాన్యం వచ్చి నీకు రెండు సంవత్సరాలుగా నెలకు రెండు వేలు అదనంగా వస్తున్నాయి. నువ్వు దాన్ని తిరిగి చెల్లించాలి... అని ఆర్డర్‌ వేయడంతో బిక్కమొహం వేయడం అతని వంతయింది. అయితే విషయం ఏమిటంటే.. ఇతనికి జీతం పెంచుతున్నట్లు ఈయన పనిచేస్తున్న విభాగం డైరెక్టరుగా చెప్పారు. అప్పటినుండి ఈయన పెరిగిన మొత్తాన్ని తీసుకుంటున్నాడు.
ఈ విషయం కాలేజీ ఛైర్మన్‌కు తెలియజేయటంలో ఎక్కడో పొరపాటు జరిగింది. అదీ రెండు సంవత్సరాల తర్వాత ఎలా తెలిసిందో ఏమో... మరి... ఇప్పుడు ఆ మొత్తం చెల్లించాలంటే...??? ఆ ఉద్యోగి ఎవరికి చెప్పుకోవాలి.. ఏమన్నా మాట్లాడదామంటే బయటికివెళ్లమంటారేమో అన్న భయం.... కాదనలేక... ఔననలేక మధనపడుతున్నాడు. ఇంతకు దీనికి బాధ్యులు ఎవరు....... దీన్ని ఎవరు భరించాలి...????   ఛైర్మన్‌కు సమాచారం అందించడంలో విఫలమైన డైరెక్టరా....?? రెండు సంవత్సరాల తర్వాతగాని నిద్ర లేవని ఆ ఛైర్మనా... లేక గత నాలుగైదు సంవత్సరాలుగా చాకిరీ చేస్తున్నా... ఆ చిరు ఉద్యోగా.....???? ఎవరు బాద్యులు....?????
సుందర్

2 comments:

  1. రెండు సంవత్సరాలు జీతము ఇచ్చాక ఇప్పుడు వెనక్కి ఇవ్వమని అనడం న్యాయమేమో కానీ ధర్మము కాదు. కాలేజీ చైర్మన్ ఉద్యోగిని క్షమించాలి, విభాగాదిపతిని మందలించాలి.

    సీతారామం

    ReplyDelete
  2. కాయితాల మీద స్పష్టత లేనట్టయితే, తీసుకున్న అదనం తిరిగివ్వక తప్పదు. న్యాయాన్యాయాల గురించి మట్లాడే ముందు సక్రమం కాని డబ్బును తిరిగిచ్చేయడం అక్రమం కాదని గ్రహించాలి. ఎవరు బాధ్యులు అని ఆక్రొశించే ముందు మన బాధ్యతెంతో గుర్తెరగాలి. పరాయి డబ్బును వాయిదాల మీదైనా తిరిగివ్వడం ఎంతైనా సబబు. అయితే దురాశ పెట్టినందుకు సంబంధిత ఉద్యోగులకు మొట్టికాయలు పడవలసిందే.

    ReplyDelete