అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, April 1, 2012

చినుకు చెలిమి...

మేఘం వీడి వేగంగా దివి పైకి దూసుకుంటూ.... వచ్చిందో చినుకు తనతో పాటూ..... తన మిత్రులు (మిగతా చినుకులు) వస్తున్నాయనీ.. ఎంతోఉరవడితో అంత ఎత్తునుండి ఒక పదునైన ముళ్లుపై పడి సగం చీలిపోయి.... ఒడ్డున ఉన్న గడ్డిపరక కొసన చేరి ఊగిసలాడుతూ.. పైకి చూస్తోంది.... తన దోస్తాన్‌ల రాకకోసం... ఆ ఎదురుచూలో బాధ ముళ్లు తనను చీల్చినప్పటికంటే భరించలేనిదిగా ఉంది... అది తట్టుకోలేక ఆకలితో నోరెండిన నేల పొరలో పడి తనువు చాలించింది. కానీ ఆ చినుకు నేలకొరగగానే ఆకాశం నుండి స్నేహితులంతా తనకోసం భూమికి చేరి నేల పొరను పిండి, పోయిన తమ మిత్రున్ని తమలో కలుపుకున్నాయి. ప్రాణం తిరిగొచ్చిన ఆ చినుకు నేస్తాలందరితో కలిసి వరదై సాగి.. ప్రేమనదిలో పొంగి స్నేహ సముద్రంలో కలిసిపోయింది.
సుందర్

No comments:

Post a Comment