నేను నా డిగ్రీ నిజాం కాలేజీలో పూర్తి చేశాను. ఇంటర్ వరకూ హాస్టల్లో ఉండి చదివేవాణ్ణి చదువులో... ఆటల్లో... సాంస్కృతిక కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటుండటంతో 'శ్రీనివాస్ (సుందర్)' అంటే స్కూళ్లో, ఇంటర్ కాలేజీలో చాలా మందికి పరిచయం ఉన్న పేరు. ఇంటర్ కాలేజీలో మంచి మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాను దీంతో నిజాం కలేజీలో సీటు వచ్చింది. నా ఆనందానికి అవదులు లేవు. అయ్య బాబోయ్.... నిజాం కాలేజీలో సీటు వచ్చింది..... అని తెగ సంబర పడిపోయా. ఇక కాలేజీ మా ఊరికి 60 కి.మి ఉంటుంది. రోజూ మార్నింగ్ 5.30కి బస్ ఎక్కితే మళ్లీ సాయంత్రం 5 గం|| లేదా 7 గం||లకు ఇంటికి వెళ్లేవాణ్ణి. కాలేజీకి వచ్చింది మొదలు ఎప్పుడు త్వరగా అవుతుందా.. ఎప్పుడు బస్ ఎక్కుదామా అన్న ద్యాస తప్ప మరొకటి ఉండేది కాదు. ఇక ఆటలు బంధ్... ఒకటీ అర తప్ప సాంస్కృతిక కార్యక్రమాలు బంధ్... చదువు కూడా అంతంత మాత్రమే... ఎలాగూ... సెమిస్టర్ సిస్టమ్ కావడంతో సింగిల్‌నైట్ సిట్టింగ్ అలవాటయిపోయింది.
మనం ఏంచేసినా చేయకున్నా కాలం ఊరుకుంటుందా... తనపని తాను చేసుకుపోయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పట్టా చేతికి వచ్చింది.. కానీ నేను నిజాం కాలేజీలో ఈ మూడు సంవత్సరాలు ఏం... చేశాను అని తలుచుకుంటే.... బస్ ఎక్కడం దిగడం డల్‌గా క్లాసులో ఓ మూలకు కూర్చోవడం... తప్ప ఏం గుర్తుకు రావడం లేదు.....ఇవే.. నా స్మృతులు. నిజాం కాలేజీ మూడు సంవత్సరాలు వేస్టు చేశానే అనుకున్నా...
కానీ ఇప్పుడు తెలిసింది. ఈ నిజాం నాకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. సుందర్‌గాడు అంటే... సైలెంట్‌గా మూలకు కూర్చుంటే ఎవడికీ తెలియదు.. మనకూ ఒక గుర్తింపు రావాలంటే మనకు ఉన్న టాలెంట్‌కు కొంచెం పదును పెట్టి ఆటా.. పాటలతో పాటు చదువును సాగిస్తే గెలుపు ముంగిట నిలుస్తామని తెలుసుకున్నా.. సో ఇప్పుడు భధ్రుక కాలేజీలో పిజీ చేస్తున్నా. నిజాంలోలా కాకుండా మునుపటి సుందర్‌లా..ఆటపాటలల్లో చురుకుగా పాల్గొంటూ చదువును కొనసాగిస్తున్నా.....
సుందర్

Good luck...keep going on
ReplyDelete