అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Saturday, October 30, 2010
దేశం నిండుగ దీపాల పండుగ
దసరా వెంట వచ్చే ప్రధానమైన పండుగ దీపావళి. మరే పండుగకూ లేని ప్రత్యేకత ఒకటి దీపావళికి వుంది. అమావాస్య చీకట్లను తరిమివేసే రంగురంగుల కాంతులే దీని స్పెషల్. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు, అందాలు విరజిమ్మే తారాజువ్వలు, క్షణానికోచోట నాట్యం చేసే భూచక్రాలు, ఆకాశాన్ని ముద్దాడాలని ముచ్చటపడే చిచ్చుబుడ్లు .... దీపావళిని జనరంజకమైన పండుగగా చేస్తాయి. దేశవ్యాప్తంగా చిన్నారులకే కాక పెద్దలకూ అత్యంత ఇష్టమైన పండుగ ఇది. మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కనుక సంక్రాంతినే అత్యంత ప్రధానమైన పండుగగా జరుపుకుంటాం. దీపావళిని ఒక్కరోజులోనే ముగించేస్తాం. కానీ ఈ పండుగను ఐదేసి రోజుల పాటు జరుపుకునే రాష్ట్రాలున్నాయి. మరి మన పొరుగు రాష్ట్రాలవారు ఈ పండుగను ఎలా చేస్తారో చూద్దామా...
Subscribe to:
Posts (Atom)
