అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, November 4, 2010

తొలి టెస్ట్ మొదటి రోజు టీమిండియా భారీ స్కోరు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది.

సెహ్వాగ్, ద్రావిడ్ సెంచరీలతో భారీ స్కోరు బాటలు వేశారు. సెహ్వాగ్ 22 టెస్ట్ సెంచరీ పూర్తి చేయగా, ద్రావిడ్ 30వ శతకం సాధించాడు.


సెహ్వాగ్ 173, ద్రావిడ్ 104, గంభీర్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. సచిన్ 13, లక్ష్మణ్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో మార్టిన్, వెటోరి, రైడర్ తలో వికెట్ తీశారు. 
సుందర్

అభాగ్య జీవులు


పొద్దుపొద్దున మూడు, మూడున్నర అవుతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు నేను ప్రజాశక్తి ఆఫీస్‌లో డ్యూటీ ముగించుకుని రూంకి వెళ్తున్నాను. కొద్దిగా ముందుకెళ్లగానే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు నిద్రమబ్బు ముఖాలతో, చిరిగినబట్టలు దరించి... చెరిగిన చింపిరి జుట్టుతో భుజాన సంచులు వేసుకుని రోడ్డుపై తొందర తొందర పరిగెడుతున్నారు. ఇంత చలిలో బతుకు పోరాటానికి బయలు దేరుతున్న వాళ్లనే గమనిస్తున్నా...