అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, February 12, 2011

మరీ ఇంత దిగజారుడు తనమా....?

ఎంత తోడినా  ఇంకా ఇంకా బయటపడుతూనే ఉంది. డ్రగ్స్‌ మాఫియ.... సెక్స్‌ స్కాండల్స్‌...  ఇన్నిరోజుల నుంచి ఉన్న ఈ అలవాటు సడెన్‌గా పోమ్మంటే పోటానికి ఇదేమన్నా చూడ్నీక వచ్చిన సుట్టమా... కానే కాదు ఏళ్ల నుండి అంటి పెట్టుకున్న చీడ అన్నాడు మా వోడు.... ఒకడు.  అందుకే రోజు రోజుకూ ప్రముఖులుగా చెప్పబడే బడా 'దొంగల ముఠా '  బాగోతాలు మొత్తం బయట పడుతున్నాయి. ఇంకా ఈ 'డ్రగ్స్‌' ఎంత మందితో సీక్రేట్‌గా రొమాన్స్‌ చేస్తోందో ఎవరికి తెలుసు. ఆ మధ్యన  రవితేజ సోదరులు డ్రగ్స్ సేవిస్తూ  దొరకి సినీ పరిశ్రమలో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు అయ్యేట్లు చేసి అన్న రవితేజను, సినీ ఇండస్ట్రీని  తలెత్తుకోకుండా చేసారు.   ఈ రోజు జీవిత సోదరుడు కూడా డ్రగ్స్ సప్ప్లై  చేస్తూ పట్టుబడి ఇంకా సినీ పారిశ్రమ ఈ డ్రగ్స్ మత్తులోనే తూగుతుందని  మరో సారి తెలిసేలా చేసాడు.
డ్రగ్సే కాదు... సెక్స్‌ రాకెట్‌లు కూడా ఒక్కొక్కటే బయట పడుతున్నాయి. మొన్న నిత్యానందతో రాసలీలలు నడిపి సినీ నటి  రంజిత పేద్ద దుమారమే రేపింది.
నిన్న సైరాభాను, జ్యోతి  ఇంకా కొంత మంది వ్యబిచారిస్తూ మీడియాకు దొరికిపోయిన సంఘటన మరవకముందే... నేడు....  హీరోయిన్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న యమున కూడా ఒక్క సారిగా సెక్స్‌ స్కాండల్‌లో దొరికిపోయి సంచలనం రేపింది. దీంతో ఏ బొక్కలో ఏ పాముందో తెలియని విదంగా.... ఎవరి గురించి ఏయే నిజాలు బయట పడతాయో అని చిత్రసీమ వణికిపోతోంది. కొంత మంది ఈ విదంగా వచ్చిన  పబ్లిసిటీ ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యనే ఎక్కడో చదివాను రీసెంట్‌గా సెక్స్‌ స్కాండల్‌లో దొరికిన ఒక సినీ ఆర్టిస్టు నెక్ష్ట్  సినిమాకోసం తన రెమ్యూనరేషన్‌ ఏకంగా పదిరెట్లు పెంచేసిందంట. అంటే మన చిత్ర సీమలో (కొంత మంది) ఎంత దిగజారి పవర్తిస్తున్నారో అర్థమవుతోంది. సినిమాలోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్న ఇలాంటి వారికి సినిమాల్లో మళ్లీ నటించకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా డ్రగ్స్ తో సంబంధమున్న సినీ ప్రముఖులు  ఎంత పెద్దవారయినా సరే వదిలి పెట్ట కుండా కాఠినంగా  శిక్షించాలి.
 సుందర్

1 comment:

  1. ఏవో అరుదైన స౦దర్బాలలో తప్ప,ఈ రోజుల్లో సినిమా అ౦టే అ౦గా౦గ ప్రదర్సన, బూతు డైలాగులు, అనైతిక దియరీలు.
    సినిమాలో ఎ౦టరవాల౦టేనే, ఆత్మాభిమానాన్ని అమ్ముకోవలసి౦దే, ఒక సారి రొ౦పి లోకి దిగిన వారికి దిగజారడ౦ పెద్ద తేడాయే౦ కాదు.

    ReplyDelete