''నీకు చాలా పెద్ద ప్రపంచం ఉండొచ్చు.... కానీ నువ్వే ప్రపంచంగా భావించే వాళ్ళుంటారు... వారిని ఎప్పుడూ హర్ట్ చేయకు''. ఈ మెసెజ్‌రాగానే మెసెజ్ బాగుంది అనుకున్నా... అయినా ఇలాంటి వాళ్ళు మనకు కూడా ఉంటారా అనుకున్నా....! ఇక నా జీవితానికి ఈ msg కి సంబంధం ఏంటంటారా..! ఆ విషయానికే వస్తున్నా.
మా రాజీగాడు (అన్న కొడుకు) ఇప్పుడు ఇబ్రహీం పట్నం residencial హాస్టల్ లో 10th క్లాస్ చదువుతున్నాడు.. వాడు నన్ను చాలా లైక్ చేస్తాడు. కొన్ని సార్లు వీడికేమన్నా పిచ్చా అనుకునేవాణ్ణి. కానీ వాడు చూపించే అభిమానాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. వాడి బర్త్ డే రోజు నాకు ఫోన్ చేసి ''బాబయ్ నువ్వు నా బర్త్ డే రోజు హాస్టల్‌కు తప్పకుండా రావాలి'' అన్నాడు. సరే రా వస్తాను అన్నాను. నీకేం గిఫ్ట్ తేవాలిరా అని అడిగా నువ్వు వస్తే చాలు అదే పెద్ద గిఫ్ట్ అన్నాడు వాడు. వాడి బర్త్‌డే రోజు రానే వచ్చింది. మార్నింగ్ నేను పడుకున్నప్పుడే ఐదారు మిస్‌కాల్స్ ఉన్నాయి. తర్వాత మళ్లీ ఫోన్ చేసి బాబాయి హాస్టల్‌కు ఎన్నిగంటలకు వస్తావు అంటే... వస్తాను లేరా... అన్నా... మళ్లీ అలాగే రెండు మూడు సార్లు ఫోను చేసి ఎప్పుడొస్తున్నావు బాబాయ్ అన్నాడు. నాకు పనుంది రా.. ఇప్పుడు రాలేను అని చెప్పాను. వాడు ఫోనులోనే ఏడ్చేశాడు. అరె అమ్మా వాళ్ళు వచ్చారు కదరా అంటే.. వింటేనా... నెక్స్ట్ వీక్ వస్తాను రా ఈని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఇక అది మర్చిపోయాను ఒక రెండు వారాల తర్వాత నేను ఊరెళ్లాను.. వాడూ హాస్టల్ నుండి వచ్చాడు. నన్ను చూడగానే ఎప్పుడొచ్చావ్ బాబాయ్ అంటూ చాలా ఆతృతగా వచ్చాడు. ఇప్పుడే రా అని వాడిని దగ్గరికి తీసుకోగానే.. '' నేను నీతో మాట్లాడను పో'' అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. ఏమైంది రా అంటే నువ్వు నా బర్త్ డే రోజు వస్తానని రావా...? ఆరోజు ఎంత ఎదురు చూసాను తెల్సా అంటూ మల్లీ ఏడుస్తున్నాడు. వాణ్ణి ఎంత కంట్రోల్ చేద్దామన్నా చాలా సేపు నావల్ల కాలేదు. చివరికి కంట్రోల్ అయినా వాడిని సంతోషంగా ఉంచాల్సిన రోజు బాధపెట్టాననిపించింది.
ఇక మొన్న ఫ్రెండ్‌షిప్ డే రోజు ఒక మా ఫ్రెండ్ ఇంటికి వస్తున్నావా అని ఫోన్ చేస్తే ఆ వస్తున్నా.. అని చెప్పా చివరి క్షణంలో వేరో ఫ్రోగ్రాం ఉంది నేను రేపు వస్తాలే అని చెప్పా.. 'పోపో మళ్లీ రాకు'' అని అలక అబ్బో మనం రేపు పోతే కూల్ చెయ్యొచ్చులే పెద్ద మ్యాటరేం కాదు అనుకున్నా.. నైట్ ఫోన్ చేస్తే ఆల్‌రెడీ అందరు ఫ్రెండ్స్ కలిసారు కదరా అన్నా. నువ్వు రాలేదు కదా నీకెందుకు అని ఇలా ఒక పది నిమిషాలు.. మాట్లాడినా అదే డైలాగ్. మరుసటి రోజు ఇంటికి వెళ్లగానే తన కళ్లలోంచి నీళ్లు... ఒక్కసారిగా దుమికాయి.. అరే ఏమైందిరా ఫ్రెండ్‌షిప్ రోజు కలిస్తేనే కలిసినట్టా మనం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం కదా అని ఎంత కన్విన్స్ చేసినా... ఊఊ.. వింటేనా.. కనీసం ఒక గంట సేపు పట్టింది. కన్విన్స్ చేయడానికి కానీ నాకే చాలా బాధగా అనిపించింది. మనమే ప్రపంచంగా ఉన్నవారిని బాధపెట్టడం అంటే.. అంతకంటే పెద్ద తప్పు మరోటి ఉండదని అర్థమైంది. ఇప్పటినుండైనా.. నన్ను 'నా' అనుకునే వాళ్ల కోసం నా సమయం మాక్జిమం కేటాయించడానికి ట్రైచేస్తా...
సుందర్
good decision. keep it up..
ReplyDeleteThats right.. "..Tears are the silent language for love... when tears come with reason means that your in problem but when tears come without reason that means your missing someone.." never give a chance for a drop of tears who likes/loves you...!
ReplyDelete