ఈ రోజు మధ్యాహ్నం ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఇబ్రహింపట్నం బస్ ఎక్కి కూర్చున్నా... బయటకు ఉమ్మాను (ఉమ్ము ఉంచాను...) ఒక తాగుబోతు నాయాల చాల దూరం నుంచి పోతున్నాడు.. వాడికేం పోయేకాలమొచ్చిందో ఎవడు భే ఉమ్మింది.. అంటూ వస్తున్నాడు.. అయినా నీ మీద పడలేదు కదా అన్నా.. అని అన్నాను వాడు వింటేనా... వాడి వాలకం చూసి బాగా తాగినట్టున్నాడు వీడితో మనకెందుకు అని సారీ.. అన్నా ఏమనుకోకు.. చూసుకోలేదు.. అన్నా.... ఏందీ భే నువ్వు చూసుకునేది అంటూ బస్ ఎక్కాడు.. సారీ అన్నా సారీ సారీ.. అంటుంటే వాడు రెచ్చిపోయి బూతులు అందుకుంటున్నాడు.. వచ్చి కాలర్ పట్టుకున్నాడు అప్పటికీ సారీ చెప్తున్నా... నా షర్టు పట్టుకోగానే షర్టు గుండీలు (బొత్తాలు) అన్నీ చిరిగిపోయాయి.. వాడు ఏదో వాగుతూ.. మా... అని ఒక బూతు తిట్టగానే ఆటోమేటిక్‌గా వాడిని కొట్టేసాను.. వాడు తాగి ఉన్నాడు.. నాకన్నా బలంగా ఉన్నాడు..అరే అనవసరంగా కొట్టానే.. వీడు నన్ను ఇక వదలడు అని డిసౖడ్ అయ్యా.. వాన్ని కాలర్ పట్టుకుని పక్కకు దొబ్బగానే పడిపోయాడు..
వీడు మంచిగా చెబితే వినేలా లేడని... వెళ్లు నీమీద పడ్డాది భే... అంటూ వానికి ఇంకా రెండు ఇచ్చాను వాడు కోపంగా లేచాడు.. వాన్ని బస్ బయటికి లాగి పోలీస్ వాళ్లు ఎవరన్నా ఉంటే వారికి అప్పగిద్దామని చుట్టూ చూసా.. టైంకు వారెందుకుంటారు చెప్పు.. వాడు తాగి ఉన్నాడు.. వాడు చెప్తే వినట్లేదు.. నేనెటో చూస్తున్నా... వాడు హీరో లెవల్లో నెత్తితో గుద్దాడు.. బానే నొప్పనిపించింది. ఇక నా కోపం ఆగలేదు.. నేనూరుకుంటానా వాడివి వాడికిచ్చేసా.. పక్కవాళ్లు వచ్చి వాన్ని తిట్టారు. వీడు బెదిరిస్తే గానీ వదిలేట్లు లేడనీ ఒక డైలాగ్ అందుకున్నా.. ''కొడుకా.. ఎవడనుకుని చెయ్యేసావో... చూస్తారరే... ఇక నీ పని ఫినిష్ ఈ బస్‌స్టాపులో ఎప్పుడన్నా కనిపించురా.. నువ్వు అయిపోయావురా...నా... డాష్.. డాష్... గా" అంటూ రఫ్‌గా రెండు మూడు బూతులందుకున్నా... ఇక వాడు ఏమనుకున్నాడో.. మెళ్లిగా జారుకున్నాడు.. అరే అనవసరంగా వాడితో గొడవపడ్డానే అనుకున్నా.. జీవితంలో ప్రతీదీ ఒక పాఠం నేర్పుతుందంట... దీని వల్ల ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. మెత్తగా ఉంటే.. మొత్తుతారు.. అని... ''తాగినోన్ని కొట్టి పేద్ద ఫైటింగ్ అంటూ బిల్డప్ ఇచ్చాడు'' అనుకుంటే... దానికి నేనేం జెప్పలేను కొన్నిసార్లు తప్పదు మరీ...
సుందర్వీడు మంచిగా చెబితే వినేలా లేడని... వెళ్లు నీమీద పడ్డాది భే... అంటూ వానికి ఇంకా రెండు ఇచ్చాను వాడు కోపంగా లేచాడు.. వాన్ని బస్ బయటికి లాగి పోలీస్ వాళ్లు ఎవరన్నా ఉంటే వారికి అప్పగిద్దామని చుట్టూ చూసా.. టైంకు వారెందుకుంటారు చెప్పు.. వాడు తాగి ఉన్నాడు.. వాడు చెప్తే వినట్లేదు.. నేనెటో చూస్తున్నా... వాడు హీరో లెవల్లో నెత్తితో గుద్దాడు.. బానే నొప్పనిపించింది. ఇక నా కోపం ఆగలేదు.. నేనూరుకుంటానా వాడివి వాడికిచ్చేసా.. పక్కవాళ్లు వచ్చి వాన్ని తిట్టారు. వీడు బెదిరిస్తే గానీ వదిలేట్లు లేడనీ ఒక డైలాగ్ అందుకున్నా.. ''కొడుకా.. ఎవడనుకుని చెయ్యేసావో... చూస్తారరే... ఇక నీ పని ఫినిష్ ఈ బస్‌స్టాపులో ఎప్పుడన్నా కనిపించురా.. నువ్వు అయిపోయావురా...నా... డాష్.. డాష్... గా" అంటూ రఫ్‌గా రెండు మూడు బూతులందుకున్నా... ఇక వాడు ఏమనుకున్నాడో.. మెళ్లిగా జారుకున్నాడు.. అరే అనవసరంగా వాడితో గొడవపడ్డానే అనుకున్నా.. జీవితంలో ప్రతీదీ ఒక పాఠం నేర్పుతుందంట... దీని వల్ల ఒక్కటి మాత్రం అర్థమయ్యింది. మెత్తగా ఉంటే.. మొత్తుతారు.. అని... ''తాగినోన్ని కొట్టి పేద్ద ఫైటింగ్ అంటూ బిల్డప్ ఇచ్చాడు'' అనుకుంటే... దానికి నేనేం జెప్పలేను కొన్నిసార్లు తప్పదు మరీ...
గుడ్ జాబ్ ...
ReplyDeleteఇంత ఫైట్ చేసి.. మెత్తగా ఉంటే మొత్తుతారు అని మాత్రం నేర్చుకున్నారు.. కాని బస్సు కిటికీలోనుండి బయటకు ఉమ్మడం సబ్యత కాదు అని మాత్రం తెలుసుకోలేదన్నమాట.
ReplyDeleteAppreciate, if you could learn about spitting.
ReplyDelete@Anonymous: righto!!
ReplyDeleteDude,
ReplyDeleteFirst you should learn civic sense.
అన్నా మీరు మరీ ఎక్కువ టెంప్ట్ అవుతున్నారు నేను ఉమ్మింది కదుల్తున్న బస్సు లోంచి కాదు నిల్చున్న బుస్లోంచి అదీ చూసి మరీ ఇలాంటి వెస్ట్ నాయాళ్ళు ఉంటారని కలలోకూడా ఊహించలేదు
ReplyDeletesundar