నేను 8,9 వ తరగతి ఉండగా అనుకుంటా...! మేము హయత్ నగర్ హాస్టల్‌లో చదివేవాళ్లం. మా దోస్తుగాళ్లు మహా జాదుగాళ్లు ఉండేవారు. బీరు సీసా అని మా దోస్తుగాళ్ల గురించి చెప్పగానే మీ బుర్రకు ఒకటి తట్టి వుంటుంది. వీడు వీడి దోస్తులు కలిసి ఫుల్‌గా కుమ్మేసుంటారు... దేడ్ గాళ్ళు అనుకుంటారు. .కానీ నేను చెప్పేది వేరు. నేను చదివింది హయత్ నగర్ కనుక చుట్టూ సినిమాహాల్లే వనస్థలీ పురం, ఎల్‌బినగర్ ఇంకా ఆ ప్రాంతంలో సుమారు నాలుగైదు సినిమా హాళ్లుంటాయి. మేము అప్పుడు రిలీజ్ అయిన ప్రతీ సినిమా చూసే వాళ్లం. ఇక విషయానికి వస్తే ఒక రోజు సినిమాకు వెళ్లానుకున్నాం. ఆ రోజుల్లో మేము10రూపాయల టిక్కెట్ మాత్రమే. వెళ్లేవాళ్లం మా దగ్గర 100 రూపాయలున్నా సరే పది రూపాయల టిక్కెట్టే...
