అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, January 8, 2011

మీకు దమ్ముంటే ఈ పదాలను గబగబా పలకండి

1. నేను నిన్ను నీనాన్నని నిన్ననేనేమైనన్నానా 
2. జగన్ కోసం జనం జనం కోసం జగన్
3. ఎల్కెల్గెగిరే 
4. గాలికోసం గనులు గనులకోసం గాలి 
5. గంపలోన కందిపప్పు గంపకింద పందికొక్కు
సుందర్

నా లైఫ్‌లో ఇలాంటి డిసెంబర్‌31 వస్తుందనుకోలేదు....

డిసెంబర్‌ 31వ తేదీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగిడేందుకు ఉత్సాహంగా ఎన్నెన్నో విదాలుగా ప్లాన్‌ చేసుకుంటా. నేను పుట్టినప్పటి నుంచి మా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఊళ్లోనే ఎంజావైయ్  చేసేవాణ్ణి... నేను ఆరవ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు హాస్టల్‌లో ఉంటూ చదివాను . డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో కూడా నిజాం హాస్టల్లో ఉన్నాను కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ ఆకరుకల్లా ఊళ్లో వాలిపోయే వాణ్ణి. నైట్‌ 12 వరకు ఫుల్‌గా డ్యాన్స్‌ చేసి.. కేక్‌ కట్‌ చేసి స్నేహితులందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ... నైట్‌ రెండు.. మూడు గంటల వరకు ఒకటే ఎంజాయ్ ... ఎంజాయ్ అంటే డ్రింకింగ్‌ అనుకునేరు.. మా డిక్షనరీలో ఇంకా ఆ పదం నమోదు చేయలేదు.(ఎందుకు పనికి మాలిన డిక్షనరీలు కొంటారు అని సెటైర్‌ వద్దు). పొద్దున్నే నిద్రలేవగానే మా యూత్‌ బిల్డింగ్‌ ముందు విషెస్‌ డిజైన్లు డిజైన్లుగా రాసి రంగురంగుల రంగులతో నింపి అందరి ఇళ్లకు తిరుగుతూ...