అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 31, 2011

వెల కట్టలేనిది అమ్మ

అమ్మ
అనుగారం మారు పేరు  అమ్మ
ఆప్యాయత అంటేనే అమ్మ
కమ్మనైన మాధుర్యం అమ్మ
కలకాలం దీవించేది అమ్మ
వెల కట్టలేనిది అమ్మ
వేయి జన్మలెత్తినా తోడుండేది అమ్మ
అమ్మ ప్రేమ కంటే స్వచ్చమైనది
అమ్మ లాలిపాటకంటే మధురమైనది
అమ్మ రూపంకంటే అపురూపమైనది
అమ్మ అనే పిలుపు కంటే  పవిత్రమైనది
అనంత విశ్వంలో ఎక్కడా లేదు.
సుందర్

విశ్వ వినువీదులలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన వేళ (1983 ప్రపంచ కప్‌లో ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించిన మధుర క్షణాలు మరోసారి నెమరు వేసుకుంటూ...)

1983 అంటే భారతీయులకు, ప్రపంచానికీ వెంటనే స్పురించేది కపిల్‌ ఆద్వర్యంలోని భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ సాధించి భారత ప్రతిష్టను ప్రపంచం దశదిశలా వ్యాపింపజేసిన అపూర్వ సంఘటన. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లిన కపిల్‌ సేన విశ్వ విజేతగా నిలిచి ఔరా అనిపిచింపించది. ఆ మధుర క్షణాలు, టీం ఇండియా ఒక్కో మ్యాచ్‌ ఎలా గెలిచారు...? అరివిర భయంకర బౌలర్లు, ఉద్దండులైన బ్యాట్మెన్లు ఉన్న విండీస్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలను ఎలా నిలువరించారో అనే విషయం తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. ఆ మధుర క్షణాలు ఒక్కటిగా... ఒక్కో మ్యాచ్‌లో భారత్‌ తన జైత్ర యాత్రను ఎలా కొనసాగించిందో.. పరిశీలిద్దాం.....