అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Thursday, February 3, 2011
నన్ను చాలా ఆకర్శించింది
కళ అనేది ఒకరి సొత్తు కాదు. కళ ఒక అద్భుతమైన విన్యాసం కావచ్చు, చాతుర్యం కావచ్చు ఇంకా పరిపూర్ణత్వం కావచ్చు ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. కొంత మంది చాలా బాగా పాడగలరు. కొంత మంది అనర్గలంగా మాట్లాడగలరు. కొంత మంది బాగా విశ్లేషించగలరు. కొంతమంది చాలా అద్భుతంగా ఆడగలరు. ఇలా చెబుతూ పోతే అనేక కళారూపాలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. ఇక నేను చెప్పేది దేనిగురించంటే నేను అలా దారెంట వెళ్తున్నానా...పక్కనే ఒక చిన్న అమ్మాయి. సుమారు పది పన్నెండు ఏళ్లుంటాయి. ఒక సన్నటి తీగ మీద ఏ ఆదారం లేకుండా కళ్లకు గంతలు కట్టుకుని నడుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి నా ఒళ్లు గగుర్పొడిచింది. ఒక వేళ ఆ అమ్మాయి పడిపోతే....
Subscribe to:
Posts (Atom)

