అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, February 13, 2011

ప్రపంచమే నివ్వరపోయేలా సెలబ్రేట్‌ చేస్తా.........

జాబిలి... జాబిలి.... జాబిలి నా హృదయలోగిలి... అంటూ ఎల్లప్పుడూ.... కలవరించే నా గురించి తెలిసిన నా స్నేహితులు నువ్వు ఈ ప్రేమికుల రోజు ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటావ్‌ అంటూ.. ప్రశ్నించగానే... ఒక చిరు నవ్వు నవ్వా ఆ నవ్వు వాడికి అర్థం కాలేదు.. వాడికే కాదు ఎవ్వరికీ అర్థం కాదు... ఎందుకంటే..
నా కలలో వచ్చి ఇంకెంత సేపు పడుకుంటావ్‌ సూర్యకాంతినై విచ్చేస్తున్నా అనగానే తన కోసం మేల్కొన్న నేను వీచేగాలిలో... తినే తిండిలో సాగే ప్రయాణంలో... చేసే పనిలో.... అనునిత్యం తలుచుకుంటూ కలలుగంటూ... ఆ రూపాన్ని అన్వేషిస్తూ... ఆ సుగుణాలను ఆలోచిస్తూ... మళ్లీ కల్లో కలవడానికై జాబిలికై నిద్రపోతానే... నా లైఫే ప్రేమమయం అయినప్పుడు ఇంకా ఒక్క రోజు గురించి ఎదురుచూడండం దేనికీ... పిచ్చికాకపోతే.... అయితే ప్రేమికులరోజును సెలబ్రేట్‌ చేసుకోవా....? అంటే .... సెలబ్రేట్‌ చేసుకుంటాను........ ఎప్పుడంటారా....
నా నిజజీవితంలోకి జాబిలి వచ్చినరోజు ప్రపంచమే నివ్వరపోయేలా సెలబ్రేట్‌ చేస్తా......... 
సుందర్

తేడా వస్తే పెళ్లిళ్లు జరిగిపోతాయి జాగర్త ....!

ప్రపంచ ప్రేమికులారా ఏకంకండి అంటూ.... ఫిబ్రవరి14 తేదీన విశ్వవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలూ.....ప్రేమికుల రోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇక రెస్టారెంట్లు, క్లబ్బులు... సినిమాహాళ్లు వాలన్‌టైన్స్‌ డేరోజు ప్రత్యేక డెకరేషన్లతో ప్రత్యేక ఆఫర్లతో హృదయాకారపు వస్తువలతో మనసులేమోగానీ, పర్సు దోచుకునేందుకు మాత్రం సిద్దంగా ఉంటారు.
ఎంత ఖర్చయినా పరవాలేదు ఈ ఒక్కరోజు ఫుల్‌ ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్‌ నేటి యూత్‌ది. ఇంకేముంది గిప్టులు, గ్రీటింగ్‌లు ట్రీటింగ్‌లు అబ్బో రోజంతా పండగే పండగ.
ఆగండాగండీ అంతా... సరదా... సరదా....నే కాదు తేడా వస్తే పెళ్లిళ్లు జరిగిపోతాయి. ఎందుకంటారా ఉన్నారుగా ఉద్దండులు ఇంకెవరు మేమే ఇండియన్స్‌ మేమే హిందూస్‌ అంటూ వచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాలు కూడా వాలైన్‌టైన్‌టైన్‌ డే కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తుంటారు.. ఎందుకంటారా... ఎవరు జంటగా దొరుకుతారా ఎవరికి పెళ్లిళ్లు చేయాలా అని పార్కులు సినిమాహాళ్లు తిరుగుతూ ఉంటారు. ప్రేమికులారా... జాగ్రత్త మరి.
సుందర్