అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, February 19, 2011

ఆల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్‌ ది బెస్ట్‌ ఇండియా

రేపు మధ్యాహ్నం భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌ ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటారా... ఒక సారి రీల్‌ వెనక్కి తిరగేయండి... పోయిన ప్రపంచకప్‌లో టీంఇండియా లీగ్‌దశలోనే ఇంటిదారి పట్టడానికి కారణం బంగ్లాదేశే... కాబట్టి కొంచెం అలసత్వం ప్రదర్శించినా... మ్యాచ్‌ ఎగరేసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు బంగ్లా పులి కూనలు... అందుకేనేమో అంతకుముందు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ అంటే ఏదో ప్రాక్టీసు మ్యాచ్‌ లాగా భావించే మన భారత జట్టు ఈ సారి సీరియస్‌గా తీసుకుని మొదటి మ్యాచ్‌లోనే అఖండ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అభేధ్యమై భారత బ్యాటింగ్‌ లైనప్‌ను చూస్తే ఇది పెద్ద విషయమేమీ కాదని అనిపిస్తుంది. మొన్న న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌నే చూసుకుంటే సచిన్‌, సెహ్వాగ్‌ సరిగ్గా ఆడకుండానే స్కోరు 360 పరుగుల మార్కు దాటింది అంటే వారు కూడా బ్యాట్‌ జుటిపించారా....! ఇక ఎంతటి జట్టైనా మట్టికరవాల్సిందే..! సచిన్,‌ సెహ్వాగ్‌ మాంచి ఆరంభాన్నందించి ఆ తర్వాత వచ్చే గంభీర్‌, యువీ, రైనా, కోహ్లీ, యూసుఫ్‌లు రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తే.. జహీర్‌ బల్లేబల్లే బజ్జీ వికెట్లతో గిల్లిగోన ఆడుకోవాలని కోరుకుంటూ........... ఆల్‌ల్‌ల్‌ల్‌ల్‌ల్‌ ల్‌ల్‌ల్‌ ది బెస్ట్‌ ఇండియా

సుందర్

వారెవ్వా.... కుమ్మేయ్ హీరో....!

ఇతని పని అయిపోయింది పరుగులు చేయడం మర్చిపోయాడు. అస్సలు షాట్స్‌ కొట్టడం లేదు. ఇతన్ని తొలగిస్తే జట్టులో ఒక మంచి ప్రతిభావంతుడైన ఆటగాన్ని తీసుకోవచ్చు,  అంటూ నిన్నటివరకూ విమర్శల జడివాన కురిపించిన వాళ్ళ నోళ్లు ఒక్క ఇన్నింగ్స్‌తో మూయించాడు  ఇండియన్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ దోని. మొన్నటి వరకూ ఫాం కొరకు తంటాలు పడిన దోనీ న్యూజీలాండ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో చెలరేగిన తీరు చూస్తే దోని మునుపటి ఫాంను అందిపుచ్చుకున్నాడని చెప్పొచ్చు.  కళ్లు చెదిరే షాట్లతో కెవలం 62 బంతుల్లో సెంచరీ  చేసిన మహేంద్రుడు ముందుగానే ప్రత్యర్థి జట్లకు ప్రమాద సూచికలు అందజేసాడు. దోని జట్టు నడిపించే తీరు. బౌలర్లను మార్చే.. ఆ టెక్నిక్‌... ఫీల్డింగ్‌ను మోహరించే ఆ నేర్పు... కీపర్‌గా... కెప్టెన్‌గా.. జట్టుకు వెన్నెముకలా ఉంటున్న దోనీ జూనియర్లను సీనియర్లను సమన్వయ పరుస్తూ జట్టును నడిపించే తీరు అమోగం. ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ తన ఊపును ఇలాగే కొనసాగిస్తే ఈ విజయ సారథి ఖాతాలో మరో ప్రపంచకప్‌ చేరుతుంది. (ఆల్‌రెడీ టి-20 ప్రపంచకప్‌ గెలుచుకొచ్చాడు కనుక). నీ వెనక నూట పది కోట్ల అభిమానం ఉంది కుమ్మేయ్ హీరో..........
సుందర్