వీడికేసమస్య వచ్చిపడిందబ్బా.. అందరి అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలను అర్థం చేసుకోవడం కష్టం అంటున్నాడు.. అనుకుంటున్నారా... కష్టం ఏం రాలేదు కానీ ఒక సంఘనట ఆదారంగా ఒక వ్యక్తిని అంచనా వేయలేం అని అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. విషయం ఏమిటంటే... నా కాలేజ్ (పిజి) స్టార్టింగ్‌లో ఏవో సర్టిఫికేట్లు సబ్‌మిట్ చేస్తున్నాము.. అప్పుడు ఒక అమ్మాయి తన సర్టిఫికెట్లు తను సబ్‌మిట్ చేయకుండా.. తను పక్కనే ఉండి పక్క అమ్మాయితో సబ్‌మిట్ చేయిస్తుంది... అప్పుడు అనుకున్నా.... అరే ఈవిడ గారికి ఇంత (ఇగో) అవసరమా... అనీ..