అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, April 3, 2011

అంటే... ఇతడు దేవుడు కాడనా... లేక దేవుడికి కూడా జ్వరమొస్తదనా....!!

ఆయనో గోప్ప........ దేముడు.. సానా గొప్ప పేరు 'సంపాదించాడు'... విదేశాలనుంచి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు... దేశ అగ్రనేతలు.. కూడా ఆయన పాదా క్రాంతులవుతారు.. ఎందుకంటే.. దేముడు కదా మరి.. తను.. గాల్లో చేతులు తిప్పి ఉంగరాలు.. విభూది ఉండలు తీయగలడు.. అతను చేతివేలు పెడితే నీళ్లు కూడా... పెట్రోల్‌ అవుతుంది.... అతను సాక్ష్యాత్‌ దైవాంశ సంభూతుడు... సంభూతుడేంటి దైవమే... మరి అలాంటి వ్యక్తితి ఆరోగ్యం కరాబ్‌గావడమేందో నా దిమాక్‌కు తట్టలే... ఎందుకంటారా.. ఏడనన్న దేవుడికి జరమొస్తాది సెప్పుండ్రి... తన జంతర్‌ మంతర్‌ మాటలతో... ఎంతో సంపాదించాడు.. (పేరు ప్రతిష్టలు) కొంత పేదలకూ.. పెడుతున్నాడు... అది మంచి పనే అనుకోండి... కానీ దేవుడే కదా ఒక చూమంతరమేసుకుంటే పోతది కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కాస్లీ వైద్యం అందిస్తే ఆరో(గం)గ్యం కాస్త కుదుట పడిందంటా... మరి దేవుడికి జ్వరం రాదు ఇతనికి జ్వరం వచ్చింది.. అంటే... ఇతడు దేవుడు కాడనా... లేక దేవుడికి కూడా జ్వరమొస్తదనా.... లేక గజం మిథ్య పలాయనం మిథ్యనా...
నాకేం సమజయితలేదు.. మీకెమన్న అయితే జెప్పుండ్రి
సుందర్

విశ్వ విజేతలుగా నిలిచిన సమయాన... ఆనందంతో కన్నీళ్ల పర్యంతరం......

భారత్‌ జీత్‌గయా........................... 120 కోట్ల మంది ఒక్కసారిగా ఎగిరి గంతేసిన వేళ.... ఎంతో శ్రమించి... ఒక్కో మ్యాచ్‌ను గెలిచేందుకు తట్టుకోలేని ఒత్తిడిని ఎదుర్కొని... ఎంతో పట్టుదలతో 'మాస్టార్‌'కు ఈ కప్‌ను కానుకగా ఇస్తామని టోర్నికిముందే చెప్పి మాట నిలుపుకునేందుకు ఈ జట్టు పడిన తపన తాపత్రయం అంతా ఇంతా కాదు...  ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంగా కొన్ని సంఘటనలు నా హృదయాన్ని కదిలించాయి. '
'ధోని సిక్సర్‌ బాదాడు..... భారత దేశంమొత్త కేరింతలతో నిండిపోయింది. యువీ ఉద్వేగంతో ధోనిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అంతే ఉద్వేగంతో ధోని కళ్లలోంచి కూడా.. నీళ్ళు పెడేళ్‌మని వచ్చేసాయి.... డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కొండంత ఆనందాన్ని నింపుకుని వచ్చిన సచిన్‌ కళ్లు కూడా చెమ్మగిళ్లాయి. యువీని.... ధోనిని గట్టిగా పట్టుకుని మాస్టారు కూడా... ఒక పెట్టున.. కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు... మన భజ్జీ మాత్రం దేన్ని ఆపుకోలేడంటాం.. అలాగే మైదానంలో అందరికంటే ఎక్కువగా కన్నీళ్లు పెడుతూ.. ఒక్కొక్కరుగా వీరు... గంభీర్‌,రైౖనా... ఫటాన్‌..... కోహ్లీ.. అబ్బబ్బబ్బ్బబ్బ... నా కళ్లలోకి నీళ్ళు దుమికాయి....
అంతే.. పట్టలేని ఆనందంతో....నేను కేరింతలు కొడుతూ... బయటకు వెళ్లిపోయాను.... మళ్లీ వచ్చే సరికి సచిన్‌ సహచరులు భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్‌లో ఊరేగడం... ఆ దృశ్యాన్ని మిస్సయ్యాను..... చాలా సేపు టీవి చానళ్లలో వెతికాని ఎంతకూ కనిపించలేదు నెట్‌ ఓపెన్‌ చేసి ఫోటోలు చూసి ఈ పోస్టు రాస్తున్నాను....
సుందర్