ఈ రోజు మధ్యాహ్నం ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఇబ్రహింపట్నం బస్ ఎక్కి కూర్చున్నా... బయటకు ఉమ్మాను (ఉమ్ము ఉంచాను...) ఒక తాగుబోతు నాయాల చాల దూరం నుంచి పోతున్నాడు.. వాడికేం పోయేకాలమొచ్చిందో ఎవడు భే ఉమ్మింది.. అంటూ వస్తున్నాడు.. అయినా నీ మీద పడలేదు కదా అన్నా.. అని అన్నాను వాడు వింటేనా... వాడి వాలకం చూసి బాగా తాగినట్టున్నాడు వీడితో మనకెందుకు అని సారీ.. అన్నా ఏమనుకోకు.. చూసుకోలేదు.. అన్నా.... ఏందీ భే నువ్వు చూసుకునేది అంటూ బస్ ఎక్కాడు.. సారీ అన్నా సారీ సారీ.. అంటుంటే వాడు రెచ్చిపోయి బూతులు అందుకుంటున్నాడు.. వచ్చి కాలర్ పట్టుకున్నాడు అప్పటికీ సారీ చెప్తున్నా... నా షర్టు పట్టుకోగానే షర్టు గుండీలు (బొత్తాలు) అన్నీ చిరిగిపోయాయి.. వాడు ఏదో వాగుతూ.. మా... అని ఒక బూతు తిట్టగానే ఆటోమేటిక్‌గా వాడిని కొట్టేసాను.. వాడు తాగి ఉన్నాడు.. నాకన్నా బలంగా ఉన్నాడు..అరే అనవసరంగా కొట్టానే.. వీడు నన్ను ఇక వదలడు అని డిసౖడ్ అయ్యా.. వాన్ని కాలర్ పట్టుకుని పక్కకు దొబ్బగానే పడిపోయాడు..