అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, June 7, 2012

వీళ్ళు నిజంగా...మోసకారులేనా...???????

కోఠీలో ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. ఆ అడావిడిలో చిరు వ్యాపారుల సందడి అంతా ఇంతా కాదు... ఒక వ్యక్తి బ్యాగులు పట్టుకుని నిల్చుంటాడు... ఒక వ్యక్తి వాక్‌మెన్‌లు అమ్ముతూ.. ఇంకో వ్యక్తి కర్చిప్‌లు అమ్ముతూ.... రకరకాల వాళ్లు తిరుగుతుంటారు. కనిపించిన ప్రతి ఒక్కర్ని బ్యాగు కావాలా సర్‌, బ్యాగు కావాలా మేడమ్‌ అంటూ ఆతృతగా అడుగుతాడు.. ఎవరన్నా కావాలి అన్నట్లు ఒక చూపు చూస్తే చాలు... ఇదిగో సార్‌ ఇది చూడండి బాగుంటుంది సార్‌.. ఇది చూడండి సార్‌ అంటూ అనేక రకాల బ్యాగులు చూపిస్తాడు. ఎంత సేపు అడిగినా విసుక్కోకుండా , మార్చిమార్చి చూపిస్తాడు. రేటు మాత్రం అసలు దానికంటే మూడింతలు చెబుతాడు ఒక వేళ కోఠీ వాతావరణం పరిచయమున్న వాళ్లయితే అతను చెప్పినదానికి అసలు రేటును అంచనా వేసి ఇంచుమించు మామూలు ధరకే బేరం చేసి కొంటారు. కోఠీకి కొత్తగా వచ్చిన వారుమాత్రం ఏం చేయాలో తెలియక అతను చెప్పినరేటు నచ్చకున్నా... డబ్బు లేకున్నా కొనకుండా వెల్లిపోతారు. డబ్బుంటే అతను చెప్పినంత ఇచ్చి బ్యాగు తీసుకెళ్తారు. అయితే  ఆ బ్యాగు ఎక్కువ ధరకు అమ్మే ఆ వ్యక్తి మోసకారా..? మంచోడా.... అంటే మోసకారే అంటారు చాలామంది..!!!
 
పొద్దున్నుండి సాయంత్రం వరకూ ఎర్రటెండలో అటూ ఇటూ తిరిగితే.. ఎవరో ఒక్కరు కొనడానకి ముందుకు వస్తారు. అందులో చాలామంది బ్యాగు చూసి చాలా సేపు బేరమాడి వెళ్లిపోతారు. ఇక రోజులో ఒక్కబ్యాగన్నా అమ్ముడుపోదా అని వెతికి వెతికి చివరకు ఒకటి, రెండు  బ్యాగులు  అమ్ముడు పోతే... ఆ బ్యాగులు  అమ్మగా వచ్చిన డబ్బులలో షాపువాడికిపోగా మిగిలిన అరకొర డబ్బు మీదే అతనూ... అతని కుటుంబం ఆదారపడి ఉంటుంది. కాబట్టి అతను ఎక్కువ ధరకు అమ్మాడు మోసకారి అందామా...? అతను చేసేది కరెక్టే జానెడు పొట్టకోసం... తనను నమ్ముకున్న వాళ్లకు మూడు పూటల రెండు ముద్దలు పెట్టేందుకు అలా చేస్తున్నాడు అనుకుందామా.???

వేలకోట్ల డబ్బున్నా ఇంకా ఇల్లీగల్‌వ్యాపారాలు చేస్తూ.. ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ కోట్లకోట్లు బ్లాక్‌మనీ ఫారిన్‌ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నవారున్న ఈ దేశంలో... సరైన ఉపాధి లేక కుటుంబాన్ని పోషించలేక అటు చావలేక బతకలేక, వేరే దారి లేక ఇలా సంపాదించే రోజుకూలీలు మోసకారులా...??
సుందర్

1 comment:

  1. Yes, they are cheating innocent people, especially people visiting from villages and towns who want to buy bags for their kids,
    If they are selling at a fixed rate to every customer at a fixed profit of, say 20-25%, it is business.

    ReplyDelete