అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, June 8, 2012

మరి దేశం 'నాది' కాదా'...???

మా ఇంట్లో దొంగలు పడ్డారు సార్‌... ఇంట్లో వస్తువులన్నీ దోచుకెళ్లారు. నా సెల్‌ ఫోన్‌ పోయింది సార్‌... ఆబిడ్స్‌ బస్‌లో నా పర్స్‌ కొట్టేసారు సార్‌.... ఇలా చాలా కంప్లయింట్స్‌ ఇస్తుంటాం.... కానీ 'నా దేశంలో దొంగలు పడ్డారు ప్రజా సంపదనంతా కొల్లగొట్టారు.. కొల్లగొడుతున్నారు' అని ఎవరైనా కంప్లయింట్‌ చేస్తారా...?? అంటే హుహూ... సెల్‌ 'నాది', పర్స్‌ 'నాది', ఇళ్లు 'నాది'...... మరి దేశం 'నాది' కాదా'...??? ప్రజలకు చెందాల్సిన పథకాల్ని అడ్డదారిలో ఉపయోగించుకుని కోట్లు కొల్లగొడుతున్న రాజకీయ నాయకులు దొంగలు కాదా....???? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను తమ అనుయాయులకు పుక్కటిగా ధారాదత్తం చేస్తున్న వాళ్లు దోపిడిదారులు కారా...??
కానీ వీరిపై కంప్లయింట్‌ చేయము ఎందుకంటే నాకెందుకు...? నేను బాగున్నా నా ఫ్యామిలీ భాగుంది..? లేనిపోని తలకాయనొప్పి నాకెందుకు..?? ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన.
ఒక దేశ గతి ప్రగతి యువత చేతిలో ఉందంటారు. యువత ఏకతాటిపై నిలబడి ఒక్కసారి ఉరిమి చూస్తే చాలు ఎవ్వడైనా ప్రజాధనాన్ని కన్నెత్తి చూడటానికే భయపడతారు. మరి నేటి యువతకు వీటి గురించి ఆలోచించే తీరికెక్కడిది...? ఒక మంచి ఉద్యోగం సంపాదించామా... రిలీజ్‌ అయిన సినిమా ఫస్ట్‌ షో చూశామా... గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజారు చేశామా... వారానికి రెండు సార్లు పార్టీ చేసుకున్నామా.... వీటిపై తప్ప ప్రపంచ దేశాలు ఎలా ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి...? నా దేశం ఎటుపోతోంది నా దేశం సంపద కొంత మంది స్వార్థ నాయకులు ఎందుకు దోచుకోవాలి...? నూట ఇరవైకోట్ల భారతీయుల భవిష్యత్‌ స్విస్‌బ్యాంకు లాకర్లలో కూరుకుపోయి ఎందుకు మగ్గాలి. అని ఒక్క క్షణం కూడా ఆలోచించే తీరిక లేకుండా లైఫ్‌ను చాలా బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇంకా దేశం అదోగతి కాకుంటే ఏమౌంతుంది.
రోజులో కనీసం ఒక్క నిమిషం మన దేశం కోసం కేటాయిద్ధాం.... ఎక్కడ సమయం దొరికితే అక్కడ అవినీతిని ప్రశ్నిద్ధాం... ప్రజా సంపదను పందికొక్కుల్లా మింగుతున్న వాళ్లను బ్లాగ్‌, ఫేస్‌బుక్‌, ఆర్కుట్‌, ట్విట్టర్‌ ఇలా మనకు ఎక్కడ వీలయితే అక్కడ ఎండగడదాం... నా దేశ సంపద 'నాది' ఎవ్వడైనా ఆక్రమాణకు పాల్పడితే అంతుచూస్తా... అంటూ.... అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ....అడుగుముందుకేద్ధాం...
సుందర్

No comments:

Post a Comment