అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, June 16, 2012

ప్రతి ఒక్కరు బృంధావన నిర్మాతలు కావాలని కోరుకోవడం అత్యాశే...!!!

''కొందరు యువకులు పుట్టుకతో కురువృద్ధులు
మరికొందరు రాబోవు యుగపు దూతలు పావన నవజీవన బృంధావన నిర్మాతలు ''
అన్నాడు శ్రీశ్రీ

నేటి యువకులు ఎంతో ప్రతిభ కలిగిఉన్నా. నిర్లక్ష్యంతో అంది వచ్చిన   అవకాశాలను వదిలేస్తూ. వారి ప్రతిభను తొక్కిపెట్టేసుకుంటున్నారు . నిరాశావాదంతో చూద్దాంలే... చేద్ధాంలే అనుకుంటూ వాయిదాలు వేస్తూ పోతున్నారు. గుమ్మంముందుకొచ్చిన అవకాశాలు పొలిమేర్లు దాటి వెనక్కి వెళ్లిపోతే...   అప్పుడు చీకట్లో దివిటి గురించి వెతికి ఏం ప్రయోజనం...అందుకే వెలుతురున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి.
పిచ్చి కాలం మనలా కూసింతసేపాగి కూర్చోదు.... ఏదో పోడుద్దామని క్షణాలను, నిమిషాలను, గంటలను, రోజులను, సంవత్సరాలను యుగాలను దాటుకుంటూ అంతులేని లక్ష్యం వైపు అణుక్షణం పయనిస్తూనే ఉంటుంది  .
ఆ కాలగమణంలో అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్లు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతే.!!
అలక్ష్యం చేసినవారు అనామకులుగా కాలగర్భంలో  కలిసిపోతారు...!!!

"అందరూ నవజీవన బృంధావన నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరుకోవడం అత్యాశే... కనీసం తమ జీవితం ఆరడుగుల బొందలో కలవకముందే. కొందరి హృదయాల్లోనైనా గూడుకట్టుకునేలా బతికితే చాలు... "
సుందర్

No comments:

Post a Comment