అంతర్జాలంతో ప్రపంచం
గుప్పిట్లోకొచ్చేసింది. కాసేపు అలా కంప్యూటర్‌పై కూర్చుంటే నిమిషాల్లో
ప్రపంచం చుట్టిరావచ్చు. మన ఆనందాల్ని, బాధల్ని, అభిప్రాయాల్ని, ఆలోచనల్ని
పంచుకోవడానికి చుట్టుపక్కన ఎవరు ఉన్నా లేకున్నా, ఫేస్‌బుక్, ఆర్క్యూట్,
ఇతర వగైరా సోషల్‌నెట్‌వర్క్ సైట్లకు వెళితే ఇక మనం వీర విహారం చేయొచ్చు.
కానీ ఇక్కడొక తిరకాసు ఉంది సుమండీ.
మొన్న ఒక పెద్దాయన చనిపోయినప్పుడు, ఒక అమ్మాయి బంద్ గురించి తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అది దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వాస్తవానికి అలా వ్యాఖ్యానించడంలో ఆ అమ్మాయికి ఎలాంటి దురభిప్రాయం లేకపోయినప్పటికీ, పోలీసులు భాగా 'షో' చేసి' ఈ అమ్మాయితో పాటు ఆ పోస్టుకు లైక్ కొట్టిన అమ్మాయిని కూడా అరెస్టు చేసి నానా రభస సృష్టించారు.
ఇక పోతే పశ్చిమబెంగాల్‌లో మమతమ్మ కార్టూన్ల గొడవ తెలిసిందే. వ్యగ్యంగా కార్టూన్లు వేశారని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కార్టూన్ అంటేనే సెటైర్‌తో.. కూడిన చురుక్కు కానీ ఆ విషయంలోనూ బాధితుడు 'బాధించ'బడ్డాడు.
నిన్న ఇదే విషయంలో ఆగ్రాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఇందోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలూ, విద్వేషం సృష్టించే విధంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు ఎప్పట్లాగే.
ఏది ఏమైనప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే మన భావాన్ని వ్యక్తీకరించడం తప్ప, పక్కోన్ని బద్నాం చేయడం కాదు. ఇతరుల వ్యక్తిగత, మత, జాతి, వర్గ పరమైన వ్యాఖ్యలు, చిత్రాలు పెట్టి రెచ్చ గొట్టడం ఏమాత్రం ఆక్షేపనీయం కాదు. కానీ అదే సమయంలో ఈ వంకతో ప్రభుత్వం, పోలీసులూ, పౌరుల వ్యక్తిగత విషయాల్లో చొరబడి అత్యుత్సాహం ప్రదర్శించడం ఏమాత్రం సమంజసనీయం కాదు.
ఇప్పుడు ప్రపంచంలో అనేక సామాజిక ఉద్యమాలు, అంతర్జాలం ద్వారా విస్తృతమౌతున్నాయి. ఒక 'నిర్భయ' సంఘటన తీసుకుంటే సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా బలపడిన ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. ఆ సంఘటిత పోరులో నేనూ ఉండుంటే భాగుండేది అని ఒక అత్యున్నత న్యాయస్థాన, న్యాయ నిర్ణేత వ్యాఖ్యానించాడంటే.. ఆ ప్రభావం.. ఆ పోరాటం సాగించడంలో అంతర్జాలం, సామాజిక నెట్‌వర్క్ ల పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం.
భారత దేశంలో భావ ప్రకటణా స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక మహౌన్నత వరం. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అది బ్రహ్మాస్త్రం, అనుచితంగా ఉపయోగిస్తే బస్మాసుర అస్త్రంగా మారి మనల్నే దహిస్తుంది.
ఈ అంతర్జాల స్వేచ్ఛని, మంచిని పెంచేందుకు, మంచిని పంచేందుకు, చెడును త్రుంచేందుకు ఉపయోగిద్ధాం...
టెక్నాలజీతో .. సమాజానికి పట్టిన వైరస్ ను తుడిచేద్దాం ..............
సుందర్

అంతర్జాలం అంటేనే ఒక పెద్ద మహా సముద్రం లాంటిది. అందులో సోషల్ నెట్ వర్కింగ్ నేడు ప్రతీ మనిషి పనిని, భావవ్యక్తీకరణ స్వేఛ్చ నపూర్తి గా వినియోగించుకొనేందుకు ఉపయోగపడుతుంది.. ఎక్కడ మంచో.. అక్కడే చెడు కూడా ..అంతా మాయ ...ఈ మాయ లోకం లో మనిషి జాగారూపుడై మాయ దారి ఉచ్చు లో పడకుండా ఉంటె చాలు.
ReplyDelete