మబ్బు
దుప్పటిని తీసేసి పైకిలేచి
కళ్లు తెరిచాడో లేదో..
ఆ
భానుడి నులివెచ్చని చూపుల
కాంతులు తాకిన మొగ్గలు..
సిగ్గుతో
విచ్చుకున్నాయనుకుంటా..
అక్కడ
రంగురంగుల పువ్వులు..
పచ్చని చెట్లు..
పిల్లగాలి
తాకగానే తుల్లిపడుతూ
కదలాడుతున్నాయ్...
ఒక
పువ్వును మించి మకొటి..
ఒక తీగను దాటి
ఇంకోటీ..
అరచేతి
అంత పెద్దగా విస్తరించి..
నన్నే పిలుస్తున్న
రోజాలు..
మేమేం
తక్కువ అంటూ.. ఫోజు
కొడుతున్న చిన్న చిన్న
గడ్డిపూలు..
వేటికవే
సాటి..
ఇదేదో
పల్లెటూరిలోని వాతావరణం
కాదు..
పక్షుల
కిలకిలారావాలెరుగని
కాంక్రీటారణ్యంలో ఉన్న..
ఓ
ఆహ్లాదమైన ప్రదేశం...
అదే
10టీవీ బిల్డింగ్ లోని
నాలుగవ అంతస్తులో ఉన్న కను విందైన నర్సరీ...
(ఉదయం
రెండు నిమిషాలు అక్కడ నిల్చుంటే..
ఎన్ని టెన్షన్స్
ఉన్నా హాం ఫట్ అంటూ ఎగిరిపోవాల్సిందే..
ప్రతీ రోజు
ఉదయం 5 నిమిషాలు
వీటిని పలకరించకుంటే..
నా రోజు
గడవట్లేదోచ్..)
No comments:
Post a Comment