అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, October 21, 2011

పదహారు అంటే ఎంత అన్నా ...?

ఏంది రా వీడికేమన్నా పిచ్చా పదహారు అంటే ఎంత అన్నాఅని  అడుగుతుండు అనుకుంటున్నారా... ఇది నిజంగా జరిగింది.... ఇది విని నవ్వాలా బాధపడాలా తెలియని పరిస్థితి. మా ఫ్రెండ్‌ శ్రీకాంత్‌కు ఒక మిల్క్‌ షాపు ఉంది. ఆ షాప్‌ దగ్గరికి ఒక 13 సం||ల పిల్లాడు పాల పాకెట్‌ కోసం వచ్చాడు. పాల పాకెట్‌ ఎంత అన్నా... అని అడిగాడు. పదహారు రూపాయలు తమ్ముడు అని చెబితే... పదహారు అంటే ఎంత అన్నా అనడంతో బిక్కపోవడం మనోడి వంతయింది. చాలా సేపు నవ్వి పదహారు అంటే సిక్స్‌టీన్‌ రా అనగానే ఓహౌ సిక్స్‌టీన్‌ ఆ... అంటూ పదహారు రూపాయలు ఇచ్చి పాల పాకెట్‌ తీసుకెళ్లాడంట.. ఈ తరం పిల్లలకు మన తెలుగు పై అంత పట్టు ఉంది మరి.
సుందర్

No comments:

Post a Comment