అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, February 4, 2011

గుర్తుపట్టే వాళ్లుంటేనే సెలబ్రిటీలు...!

ఈ మధ్యన ఒక సారి మా స్నేహితుని దగ్గరికి (పవన్ మామ) వెళ్లాను. మనకు ఒక అలవాటు ఏడ్చి సచ్చింది. కనబడిన పుస్తకాన్నళ్లా చదవడం. అతని రూంలో బుక్స్‌ గురించి వెతుకుతున్నా.. అప్పుడే శోభన్‌ బాబు లైఫ్‌ హిస్టరి గురించిన ఒక పుస్తకం దొరికింది ఏంటో అనుకుంటూ చదవడం మొదలు పెట్టాను. చాలా వరకు చదివాను కాని అందులో ఒకే ఒక వాఖ్యం నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఒక రోజు శోభన్‌బాబు అతనితో పాటు మరో పాపులర్‌ ఆర్టిస్టు షూటింగ్‌ పనిమీద వేరే రాష్ట్రానికో, వేరో దేశానికో అంత గుర్తు లేదు కాని మన రాష్ట్రం విడిచి వెళ్లారు. అక్కడ రోడ్డు పై చాలాసేపు వారికి కావల్సిన వారికోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారు ఎంతకూ  రావట్లేదు. వచ్చిపోయే వాళ్లు మాత్రం వాళ్లను గమనించకుండానే వెళ్తున్నారు. అప్పుడు అన్నాడట శోభన్‌బాబు మనల్ని గుర్తు పట్టే వాళ్లున్నంత వరకే మనం సెలబ్రిటీలం మనల్ని గుర్తు పట్టేవాళ్లు లేకపోతే అనామకులం అన్నాడట ఆ వాఖ్యం నాకు చాలా బాగా నచ్చింది. 
సుందర్

మానవతా విలువలు మంటగలిసిన వేళ

దిల్‌సుఖ్‌ నగర్‌ అంటే చాలా రద్దీ ప్రదేశం అదీ ఉదయం పది పదకొండు గంటలకు అంటే ఇక ప్రాంతం ఎంత రద్ధీగా ఉంటుందో ఊహించొచ్చు సరిగ్గా అప్పుడే బస్టాండ్‌నుండి సినిమా థియేటర్‌ వైపు వెళ్తున్నా. రోడ్డు పక్కనే ఒక ముసలాయన పడిఉన్నాడు. అతడు మూర్చపోయి పడ్డడా...? తాగి పడ్డాడా లేక ఇంకెందుకు అక్కడ పడిపోయాడో తెలియదు కాని స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అంత మంది ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు పక్కనుంచే నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువైపు చూస్తున్నారు.మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృష్యం హృదయ విదారకంగా కనిపిస్తుంది. మా ఫ్రెండ్సేమో సినిమాకు టైం అవుతుంది నడవరా అంటూ లాక్కెల్లారు సినిమా హాల్లో ఉన్నానే తప్పా ఆ సినిమా నడుస్తున్నంత సేపు అదే ఆలోచించాను.  ఉరుకులు పరుగుల సమాజంలో కనీస మానవతా విలువలు మర్చిపోయి సాగుతున్న ఈ ప్రయానం  ఎక్కడికో ..  అనుకుంటూ ముందు నన్ను నేను తిట్టుకున్నాను ఒక మనిషి దిక్కుతోచని స్థితిలో ఉంటే సినిమా కావల్సివచ్చిందా అనుకుంటూ... మనసంతా ఒకటే అలజడి. సినిమా అయిపోగానే వెళ్లి చూస్తే అక్కడ అతను లేడు కొంచెం మనసు తేలిక పడినప్పటికీ అందరితోపాటూ నేనూ అలాగే వెళ్లడాన్ని నా హృదయం నన్నింకా నిందిస్తూనే ఉంది.

సుందర్