నిన్న మొన్నటి వరకు న్యూస్‌పేపర్లలో, టీవీల్లో, నెట్‌లో ఒకటే న్యూస్ సెంట్రల్ ఆఫ్ అటెన్షన్ అంతా ఒకరిపైనే.. ప్రపంచ అగ్రదేశాలను గడగడలాడించింది ఒకే ఒక్కడు గన్నుతో కాదు దానికన్నా పదునైన 'పెన్ను'తో అతడే ద గ్రేట్ స్టార్ అసాంజె. ఒక్కసారిగా ప్రపంచాని హీరో అయిపోయాడు. ఎందుకు...? ఎందుకంటే కేవలం నిజం నిర్భయంగా రాయడం వల్లే వికీలీక్స్‌తో అవినీతి బాగోతాల గుట్టును లీక్ చేయడమే అతని హీరోయిజం. ఎందుకంటారా... అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసినా... తన వికీలీక్స్‌పై నిషేదం విధిస్తామని బెధిరించినా అధరక బెధరక నిషేదం విధించి చూడు ఇంతకంటే వేగంగా, ఇంత కంటే సీక్రేట్ విషయాలను వెంటనే బట్టబయలు చేస్తాననడంతో అరాచక వాదులు తోకముడించారు.
ఈ సంచనాల స్టార్ ఒక్కో సీక్రేటను బహిరంగపరుస్తుంటే మీకందరికీ ఏమనిపిస్తుందోగానీ నాకు మాత్రం ఒకటనిపించింది. అదేంటంటే వీకిలీక్స్ కు మాత్రమే ఇలాంటి సమాచారం ఎలా లభిస్తుంది...? లభించినా ఎక్కడనుంచి వస్తుంది...? ఇతర మీడియాకు ఇలాంటి సమాచారం ఎందుకు దొరకట్లేదు..? ఒక వేళ లభించినా అవి బయట పెట్టే గట్స్ లేవా...?అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....
Friday, February 25, 2011
సిల్లీ పాయింట్........ అన్యోన్యంగా ఉండే స్నేహితుల మద్య ఐదు సంవత్సరాల అంతరాన్ని పెంచింది ..!
ఎక్కువ ఇష్టమైనవాళ్లతోనే ఎక్కువగా పోట్లాడుతుంటాము అది ఏ రేంజ్‌లో అంటే చెప్పనలవి కాదు. అంత పోట్లాడినా మరుక్షణమే మాట్లాడటం ఆనవాయితీ... కానీ కొన్ని సార్లు ఎంతో ఇష్టమైన వాళ్లతో వచ్చిన చిన్న గొడవ పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. అలాంటప్పుడు పంతాలు పట్టింపులకు పోయి మాట్లాడుకోవడం మానేసామనుకోండి. అది కొన్ని సంవత్సరాలపాటు అలానే సాగుతుంది. ఇద్దరి మనసుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనిపిస్తున్నా...? కానీ... ఇగో అడ్డం వచ్చి మాట్లాడుకోరు. ఇది ఏదో ఊహించి చెప్పుతున్నది కాదు నా జీవితంలో జరిగింది. కనుకనే చెబుతున్నా..
Subscribe to:
Posts (Atom)
