అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, April 1, 2011

ప్రపంచకప్‌ ఫైనల్‌ నుంచి వైదొలిగిన సచిన్‌, సెహ్వాగ్‌... ఫైనల్‌కు ముందే టీంలో సచిన్‌ సెహ్వాగ్‌ లేరంటే మనోస్థైర్యం దెబ్బతింటుందని ఈ విషయాన్ని మీడియాకు పొక్కకుండా చూసిన టీం మేనేజ్‌మెంట్‌...!

ఎంతో శ్రమించి గ్రూప్‌ దశ నుంచి ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ.... క్వార్టర్స్‌లో ఆసిస్‌ను, సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు చివరి అంకంలో పెద్ద దెబ్బే తగిలింది. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలబడుతూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న భారత ఓపెనింగ్‌ జోడి సచిన్‌, సెహ్వాగ్‌ నేడు జరుగనున్న ప్రపంచకప్‌ ఫైనల్‌నుంచి నిష్క్రమించారు. ఫైనల్‌ కొరకై మిగతా ఆటగాళ్ల కంటే ఎక్కువగా ప్రాక్టీసు చేసిన సచిన్‌ కండరాలు పట్టేయడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమే అంటున్నారు. గురువారం ప్రాక్టీసులో భాగంగా శ్రీశాంత్‌ సరదాగా విసిరిన బంతి తాకి సెహ్వాగ్‌ కుడిచేతి చూపుడు వేలికి తీవ్రగాయం అయ్యింది. దీంతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంచేందుకు డాక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఫైనల్‌కు ముందే టీంలో సచిన్‌ సెహ్వాగ్‌ లేరంటే మనోస్థైర్యం దెబ్బతింటుందని ఈ విషయాన్ని మీడియాకు పొక్కనియ్యడం లేదు.

ఇక మిగిలింది పూర్ణకుంబాన్ని కొట్టడమే.. !!!

 ఈజట్టా ప్రపంచ కప్‌ కొట్టేది...? పసి కూనలపై చెమటోడ్చి నెగ్గింది...?బౌలింగ్‌లో అసలు పసలేదు. 330 పరుగులు చేసి ఎదుటి జట్టును కట్టడి చేయలేకపోయింది. 40 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 268 స్కోరుతో పటిష్టంగా ఉన్న జట్టు టపటపా వికెట్లు కోల్పోయి చివరకు 296 పరుగులకే ఆలౌటయ్యింది. క్వార్టర్స్‌ దాటడమే కష్టం ...ఇక ప్రపంచకప్‌ భారత్‌ క్రికెట్‌ జట్టు కలగానే మిగులుతుంది....í
అని విమర్శలు చేసిన జట్టు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఘోర పరాజయం పాల్జేసిన ఆసిస్‌ జట్టును క్వార్టర్స్‌ నుండే ఇంటి దారి పట్టించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సెమీస్ లోనే మట్టి కరిపించింది. ఇక మిగిలింది పూర్ణకుంబాన్ని కొట్టడమే.. ఇంత వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు లేదా.. ఇద్దరే రాణించారు. ఇక మిగిలింది ఒకటే మ్యాచ్‌ అదీ కప్‌ తెచ్చి విశ్వ వినువీదులలో భారత పతాకాన్ని ఎగరేసే అద్భుత అవకాశం... 
ఫైనల్‌లో వీరు.. విజృంభన... మాస్టార్‌ 'బ్లాస్టార్‌' ప్లే... గంభీర ఇన్నింగ్స్‌... యువీ ఉరకలు... రైనా... రౌద్రం... మహేంద్రుని... మెరుపులు.. జ'హీరో'యిజం అన్నిటిని ఏకం చేసే సమయం ఆసన్నమైంది. గెలుపే ధ్యేయంగా.... లక్ష్య సాధనకై ముందడుగేస్తే ఎదురొచ్చే దమ్మూ... ధైర్యం... శ్రీలంకకు ఉన్నాయంటారా... అహా ఉన్నయంటారా అంటా...!

సుందర్