అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, July 13, 2011

ఆయనగురించి తెలియదా...? ఇక నువ్వు వేస్టు బాబూ......!

నేనూ మా ఆఫీసు ఫ్రెండ్స్‌ (అమర్‌, పవన్‌, శ్రీకాంత్‌, రాజు, రాంచదంర్‌), కలిసి నైట్‌ డ్యూటీ అయిపోగానే మార్నింగ్‌ 4గ||కి టీ తాగటానికి వెళ్తుంటాము. వెళ్లే మార్గమధ్యలో మా చర్చలు ఓ రేంజ్‌లో జరుగుతాయి. అది దేనిగురించి అంటూ ప్రత్యేకించి ఉండదు. దేశ రాజకీయాలు కావచ్చు... సినిమాలు కావచ్చు... భవిష్యత్‌ ప్రణాళికలు కావచ్చు.. ఇక ప్రముఖ వ్యక్తుల గురించి కావచ్చు.... ఆ చర్చలు 3.30కి ఆఫీసు నుంచి వెళ్లేప్పుడు స్టార్టయితే మళ్లీ మార్నింగ్‌ 6గం||కి తిరిగి ఎక్కడి వారక్కడికి వెళ్లేదాకా సాగుతాయన్నమాట. ఈ మధ్య ఒక రోజు సాదారణంగా ఏదో చర్చసాగుతోంది. అనుకోకుండా.. అందులోకి స్టీఫెన్‌ హ్యాకింగ్‌ గురించిన మాట్లాడుతున్నాడు మా అమరన్న.. ఏదైనా ప్రశ్నించడం అలవాటున్న నేను ఎవరన్నా.. ఈ స్టీఫెన్‌ హ్యాకిన్‌ అన్నాన్నేను. అయితే ఇంతకు ముందు ఈ పేరెక్కడో విన్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు. మా గ్యాంగ్‌లో అందరినీ అడిగాడు నీకు స్టీఫెన్‌ హ్యాకిన్‌ తెల్సా తెల్సా అని.. కొద్ది మంది పేరు విన్నామని కొద్ది మంది తెలుసని అన్నారు. అప్పుడు అమర్‌ అన్నాడు బాబు నువ్వు వేస్టు... నీకు ఆయన కూడా తెల్వదా అని.... నాకు తెల్వదన్నా నువ్వు చెప్పు అన్నాన్నేను. నేను చెప్పను బాబు ఆయనగురించి తెలియదా...? ఇక నువ్వు వేస్టు బాబూ అంటాడు.. అరే అన్నా చాలా మంది గురించి వింటా కానీ అందరిగురించి గుర్తుండదు కదా అన్నా అన్నాన్నేను కానీ అయినా వినడు ఇదిగో ఈ పిల్లాడు అడిగినా చెప్పేవాణ్ణి నువ్వ అడుగుతావా? ఏం చదువుతున్నావు బాబు.. ఎంకామా... ఎక్కడ చదువుతున్నావు బాబూ అంటూ ఏదో విమర్శిస్తున్నాడు తప్ప మ్యాటరు చెప్పట్లేదు. ఇదిగో అన్న నాకు తెలియదు చెప్పన్నా చెప్పన్నా.. అని చాలా సార్లు బతిలాడితే.. ఇక చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన ఒక ఫిజిక్స్‌ శాస్త్రవేత్త అతని బాడీలో ఏ పార్టు పనిచేయదు ఒక మెదడు మాత్రమే పనిచేస్తుంది. ఆయన ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అంతరిక్షంలో 'బ్లాక్‌హౌల్స్‌' గురించిన పరిశోధనలు చేస్తున్నాడు అని చెప్పాడు. మా రాజు అడిగాడూ....  అతని మెదడు మాత్రమే పనిచేస్తే మిగతా పార్టులేవీ పనిచేయకుంటే.. అతన ఎలా పరిశోదనలు చేస్తాడు అని అడిగాడు. అతని మెదడుకు కంప్యూటర్‌తో కనెక్షన్‌ ఉంటుంది. ఆయన ఆలోచనలను అది అందిస్తుంది దాని ద్వారా అతని సహాయకులు దాన్ని మాడిఫై చేస్తారు అని చెప్పాడు. అప్పుడన్నాన్నేను అన్నా ఆయన గురించి నాకు తెలుసు... ఒక శాస్త్రవేత్త ఉంటాడు అతనికి బాడీ పార్ట్స్‌ ఏవీ పనిచేయవు అయినా గొప్ప శాస్త్రవేత్త అని తెలుసు కానీ ఆయన పేరు స్టీఫెన్‌ హ్యాకిన్‌ అని నాకు తెలియదు... కావాలంటే నా బ్లాగులో 2010 సెప్టెబర్‌లోనేే ఆయనగురించిన ఐటమ్‌ ఒకటి పెట్టాను చూడు అన్నాన్నేను. ఆయన గురించి ఒక ఐటెమ్‌ రాసి ఆయన పేరు తెలియదంటావా అంటూ స్టార్ట్‌ చేసాడు మా అమర్‌ భయ్యా... అది ఎప్పుడాగి పోయిందంటే ఎక్కడివారు అక్కడికి వెళేలవరకూ క్లాసు అబ్బో.
సుందర్

సేమ్‌ పది సంవత్సరాల కిందటి సీన్‌ మళ్లీ రిపీట్‌ అయ్యింది. అప్పుడు నేనూ ఇప్పుడు వాడు...!

మా చిన్నన్న కొడుకు శ్రీచరన్‌. వాణ్ణి ఈ సంవత్సరం రెసిడెన్షియల్‌ హాస్టల్‌లో జాయిన్‌ చేశాము. లాస్ట్‌ వీక్‌ హాస్టల్‌కి వెళ్లి వాడికి ఇంకా మా తమ్ముళ్లు వేరేవాళ్లు ఉంటారు.. వాళ్లకు కూడా కావాల్సినవి ఇప్పించి అంతా బాగుందారా అని అడిగి చాలా సేపు వాళ్లతో స్పెండ్ చే‌శాను  అప్పుడు చాలా బాగుంది బాబాయ్ అంటూ చెప్పిన వాడు. ఈ సండే నేను ఇంటికి వెళ్లే సరికి ఇంటి దగ్గర ఉన్నాడు. ఎప్పుడొచ్చావురా అంటే నిన్న వచ్చాన్‌ బాబాయ్ అన్నాడు. సర్లే అని మళ్లీ సిటీ వచ్చి మండే కూడా ఇంటికి వెళ్లాను మండే స్కూల్‌ ఉంటుంది వీడేంటి ఇంకా వెళ్లలేదు అనుకున్నా కానీ ఎందుకు వెళ్లలేదురా అని మాత్రం అడగలేదు. ఎందుకంటే నేనూ చిన్నప్పుడు హాస్టల్‌లో చదివేప్పుడు ఎవరన్నా ఎప్పుడెళ్తున్నావు రా.... అని అడిగితే ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది కాబట్టి వాణ్ణి అడగలేదు. ఇక మండే అలాగే గడిచింది ట్యూస్‌డే మార్నింగ్‌ పడుకుని ఉన్నాను 'వీడు హాస్టల్‌కు వెళ్లనంటున్నాడు జర సూడయ్యా' అని మా వదిన నున్ను నిద్ర లేపడంతో మెలువయ్యిది. ఏమైంది రా ఎందుకు వెళ్లవు అని వాళ్ల అమ్మా నాన్న అడుగుతున్నారు. కానీ నాకు కరెక్టుగా వాడిలో నేనే కనిపిస్తున్నాను. ఎందుకంటే కరెక్టుగా పది సంవత్సరాల క్రితం నేనూ కూడా హాస్టల్‌కు వెళ్లను అంటూ ఇంట్లో వాళ్లతో చెప్పాను. అప్పుడు ఈ ఒక్క సారికి హాస్టల్‌లో చదువురా మళ్లీ వచ్చేసారి ఇంటికి తీసుకొస్తాం అన్నారు నేను విన్లేదు. అయినా సరే టీసి ఇవ్వట్లేదు ఈ ఒక్కసారికి చదువురా అంటే గుడ్డిగా నమ్మి ఆ ఒక్కసంవత్సరం అని ఉంటే ఏకంగా 8 సంవత్సరాలు హాస్టల్లోనే చదివాను. వాణ్ణి కూడా అలాగే సముదాయించాను ఈ ఒక్కసారి చదువురా నెక్స్ట్‌ ఇయర్‌ మన ఊళ్లో చదువుదువుగానీ అన్నానేన్నేను. ఆ 'ఏమొద్దుపో నేను ఈన్నే సదువుతా' ఇది వాడి రియాక్షన్‌ సరే రా ఈ సారి టిసి ఇవ్వర్రా వచ్చే సారికి తీసుకుందాం అన్నాన్నేను వాడు చాలా ఫాస్ట్‌ ''ఏంకాదు ఇస్తున్నారు'' అన్నాడు. వాడిని సముదాయించడం ఎవ్వరితో అవ్వట్లేదు కనీసం హాస్టల్‌వద్దకు తీసుకెళ్తే అక్కడ వదిలి వస్తే వారం రోజుల్లో వాడే సెట్‌ అవుతాడని వాడిని హాస్టల్‌కు తీసుకెళ్ళి అక్కడే వదిలి వచ్చాను నెక్స్ట్‌ వీక్‌ మళ్లీ వెళ్లి చూడాలి.. ఏమంటాడో....? చూడాలి మరి!
సుందర్