అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, November 2, 2010

ఐషుకు ముప్పైఏడా...!


అందాల ఐషుకు ముప్పైఏడు సంవత్సరాలు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎవరెందుకు నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా...ఎందుకంటే ఎన్నేళ్లయినా తరగని అందం.. సచిన్‌ టెండూల్కర్‌ ఆట ఐషు అందం సంవత్సరాలు పెరిగినకొద్దీ రెట్టింపవుతోంది. నేను నాచిన్నప్పటినుంచి ఐశ్వర్యారాయ్ సినిమాలు చూస్తున్నాను. కానీ ఎప్పుడు లైక్‌ చేయలేదు అంటే లైట్‌ తీసుకునేవాన్నీ... ఎందుకో రోబో సినిమా చూడగానే వెంటనే ఇంప్రెస్‌ అయ్యాను ఎందుకో తెలియదు. జస్ట్‌ ఐషు కోసమే ముఖ్యంగా 'సింహంవేట' పాటలో ఐషు చెంగుచెంగున లేడిలా ఎగురుతూ ఆడే ఆ డ్యాన్సు గురించే రెండు సార్లు చూసాను ఇంకా ఎన్ని సార్లు చూసినా తనివితీరదు... ఎందుకంటే నాకు ఆ పాట ఆ డ్యాన్సు...
ఆ అభినయం అంతగా నచ్చాయి.
నాకు నచ్చకపోతే అస్సలు పట్టించుకోను నచ్చితే అస్సలు వదిలిపెట్టను ఇదేదో సినిమా డైలాగ్‌లా ఉన్నా నిజం. ముఖ్యంగా రోబో సినిమాలో డైరెక్టర్‌ శంకర్‌ ప్రతీ సీన్‌లో ఐషును చాలా చాలా అందంగా చూయించాడు. ఎందుకో ఏమోగానీ నాకు మాత్రం తెగ నచ్చేసింది. దీన్ని చదివి నాగురించి ఎవరు ఏమనుకున్నా సరే గానీ తెగేసి ఒకటి చెబుతున్నా... లైఫ్‌లో ఒక్కసారయినా ఐషును చూడాలి.. చూడ్డమే కాదు మాట్లాడాలి.... ఏంటో పిచ్చోడు కలలు కంటున్నాడు అనుకుంటున్నారా...
మీరు అలాగే నవ్వుకోండి నేను ఆ నవ్వుల పువ్వులపై ఐషు చెంతకు చేరకపోతానా.. మీరు చూడకపోతారా... అప్పుడు మీరు నోరు వెళ్లబెట్టక పోతారా... ఏంటో అన్నీ సీక్రేట్స్‌ లీక్‌ చేస్తున్నా... సారీ అభిషేక్‌ ఏమనుకోకే..





సుందర్

1 comment:

  1. i lllllllllllllllllllllllllllllllllllllllllllke u ashhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

    ReplyDelete