నేను హైదరాబాద్ వచ్చి ఇప్పటికీ ఐదు  సంవత్సరాలవుతుంది. అయినా ఇంత వరకూ చార్మినార్ చూడలేదంటే విచిత్రం కాకపోదు.  చాలాసార్లు మదీనా వరకు వెళ్లినప్పటికీ చార్మినార్ చూడలేదు. ఈ మధ్యనే  మిత్రులతో కలిసి గోల్కొండకు వెళ్లాము చాలా సార్లు పుస్తకాల్లో చదవడం  పోకిరీ, అన్నవరం లాంటి తెలుగు సినిమాల్లో చూడటం తప్ప ఇంతవరకూ నేను గోల్కొండ  కోట చూసింది లేదు. అంతకు ముందు  రోజే నెట్‌లో గోల్కొండ చరిత్ర  చదవడం జరిగింది. ముఖ్యంగా 
దర్వాజా దగ్గర చప్పట్లు  కొడితే ఎక్కడో బాలా హిస్సారు వద్ద వినిపిస్తుందని విన్నాము  ఆ  ప్రదేశాన్ని  చూడాలని ఆసక్తి ఉంది. చాలా సేపు అక్కడ ఉండి ఇక్కడ చప్పట్లు కొడుతూ ఉన్నాము.   అయినా ఎక్కడ  వినిపస్తుందో తెలియదు ఎవర్నైనా అడుగుదాం అంటే మొహమాటం అడ్డువచ్చింది.  ముందుకు వెళితే అదే తెలుస్తుంది. అనుకుంటూ బయలు దేరాము.
ఇంకో ముఖ్య విషయం  ఏమిటంటే మేము గోల్కొండకు వెళ్లిందే ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఆ  డాక్యుమెంటరీ తీసుకుంటూ... ఫోటోలు దిగుతూ అక్కడి ప్రదేశాలను చూస్తూ చాలా  ఉత్సాహంగా గడిపాము. అక్కడ రాళ్ళతో కట్టిన కట్టడాలు వావ్‌వా అత్యద్భుతం  అంతటి ప్రావీణ్యంతో నిర్మించిన ఆ కూలీలను (కళాకారులను ) అభినందించాలి. మేము  అక్కడ అంతా తిరిగి ఆ చప్పట్లు ఎక్కడ వినిపిస్తాయో  తెలుసుకుందామనుకున్నాము.కానీ ఆ బాల హిస్సారు ప్రాంతం ఎక్కడుందో చూడలేదు... ఒకవేళ చూసినప్పటికీ అది బాలా హిస్సారు అని మాకు తెలియదు.  రామదాసు మందిరం చూసాము. చాలా టైం డాక్యుమెంటరీ  తీయడానికే సరిపోయింది. మళ్లీ ఎప్పుడైనా వెళ్లి గోల్కొండ అంతా మరోసారి  క్షుణ్ణంగా చూసి రావాలి... 
సుందర్t
దర్వాజా దగ్గర చప్పట్లు  కొడితే ఎక్కడో బాలా హిస్సారు వద్ద వినిపిస్తుందని విన్నాము  ఆ  ప్రదేశాన్ని  చూడాలని ఆసక్తి ఉంది. చాలా సేపు అక్కడ ఉండి ఇక్కడ చప్పట్లు కొడుతూ ఉన్నాము.   అయినా ఎక్కడ  వినిపస్తుందో తెలియదు ఎవర్నైనా అడుగుదాం అంటే మొహమాటం అడ్డువచ్చింది.  ముందుకు వెళితే అదే తెలుస్తుంది. అనుకుంటూ బయలు దేరాము.
ఇంకో ముఖ్య విషయం  ఏమిటంటే మేము గోల్కొండకు వెళ్లిందే ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఆ  డాక్యుమెంటరీ తీసుకుంటూ... ఫోటోలు దిగుతూ అక్కడి ప్రదేశాలను చూస్తూ చాలా  ఉత్సాహంగా గడిపాము. అక్కడ రాళ్ళతో కట్టిన కట్టడాలు వావ్‌వా అత్యద్భుతం  అంతటి ప్రావీణ్యంతో నిర్మించిన ఆ కూలీలను (కళాకారులను ) అభినందించాలి. మేము  అక్కడ అంతా తిరిగి ఆ చప్పట్లు ఎక్కడ వినిపిస్తాయో  తెలుసుకుందామనుకున్నాము.కానీ ఆ బాల హిస్సారు ప్రాంతం ఎక్కడుందో చూడలేదు... ఒకవేళ చూసినప్పటికీ అది బాలా హిస్సారు అని మాకు తెలియదు.  రామదాసు మందిరం చూసాము. చాలా టైం డాక్యుమెంటరీ  తీయడానికే సరిపోయింది. మళ్లీ ఎప్పుడైనా వెళ్లి గోల్కొండ అంతా మరోసారి  క్షుణ్ణంగా చూసి రావాలి... సుందర్t

No comments:
Post a Comment