ఈరోజు జరిగిన మిలియన్ మార్చ్ జరిగిన విదానం చూస్తే.... మిలియన్ ప్రశ్నలు మెదలాడుతున్నాయి...!
1) మిలియన్ మార్చ్‌కు అనుమతి ఎందుకు ఇవ్వలేదు...?
2) రాష్ట్ర పోలీసులు, అదనంగా కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ ఈ మార్చ్‌ను ఎందుకు ఆపలేక పోయారు...?
3) నిన్నటి వరకూ కెసిఆర్ ఈ మార్చ్‌కు దూరంగా ఉంటాడు అంటూ వచ్చిన పుకార్లను పటాపటాపంచలు చేస్తూ.... కెసిఆర్ ట్యాంకు బండ్ దగ్గర ఒకే సారి ఎలా ఊడిపడ్డాడు...?
మేము పది లక్షల మందితో ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహిస్తాం అని జెఎసి ముందుగానే ప్రకటించింది. దీనికి కోర్టునుంచిగానీ ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి అనుమతి లేదు... దీన్ని ఆపటంకోసం కేంద్ర బలగాలు కూడా..కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఇతర జిల్లాల నుంచి జనాన్ని రానివ్వకుండా ఎక్కడికక్కడ ఆపగలిగారు సరే..! నిన్న మొన్నటిదాకా మిలియన్ మార్చ్ కు కెసిఆర్ రాడు అని పుకార్లు వచ్చిన మాట విదితమే